twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమ్మ మరణానికి కారణం అదే: ఎవరికీ తెలియని విషయాలు చెప్పిన సావిత్రి కూతురు!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Savitri Daughter Reveals About Her Mother In An Interview

    సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి 'మహానటి' సినిమాపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సినిమా చూస్తుంటే అమ్మ జీవితాన్ని దగ్గరగా చూసిన ఫీలింగ్ కలిగిందని, అమ్మకు సంబంధించిన ఎన్నో నిజాలు ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు తెలుస్తాయని ఆమె వెల్లడించారు. 'మహానటి' విడుదల సందర్భంగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ చాముండేశ్వరి ఇప్పటివరకు ఎవరికీ తెలియని మరిన్ని విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా ఆమె మరణానికి కారణం ఏమిటి? అమ్మ తమను ఎలా పెంచింది, తమతో ఎలా ఉండేది అనే విషయాలు బయట పెట్టారు.

    ఈ సినిమా ద్వారా అవన్నీ చూశాను

    ఈ సినిమా ద్వారా అవన్నీ చూశాను

    సాధారణంగా అమ్మ పెళ్లి ఆల్బమ్స్ చూసేపుడు అయ్యో నేను ఎందుకు ఇక్కడ లేనా? అని చాలా మంది చిన్న పిల్లలు అనుకుంటారు. ఈ సినిమా ద్వారా అమ్మ పెళ్లి మాత్రమే కాదు, అమ్మ నాన్నగారితో ఎలా లవ్ లో పడింది? వారు ఎంత అన్యోన్యంగా ఉండేవారు? దానికి ముందు చిన్నతనం ఎలా గడిపింది? అన్నీ ఎవరో చెబితే విన్నాను కానీ... ఈ సినిమా ద్వారా స్వయంగా చూసే అవకాశం దక్కిందని విజయ చాముండేశ్వరి తెలిపారు.

    క్రమ శిక్షణ... ఆప్యాయత రెండు బ్యాలెన్స్ చేస్తూ పెంచింది

    క్రమ శిక్షణ... ఆప్యాయత రెండు బ్యాలెన్స్ చేస్తూ పెంచింది

    అమ్మ పెంపకం చాలా డిసిప్లేన్‌గా ఉండేది. ఆడపిల్లలు చక్కగా కూర్చోవడం ఎలా అనే విషయం దగ్గర నుండి ఎలా అణకువగా ఉండాలి, పనివాళ్లతో ఎలా బిహేవ్ చేయాలి? ఎవరినీ డ్రైవర్ అనో, వారు చేసే ప్రొఫెషన్ పేరుతోనో పిలవకూడదు, వారి పేరు కనుక్కుని పేరుతోనే పిలవాలి. చిన్న పెద్ద అనే డిఫరెన్స్ చూపకుండా అందరికీ ఒకే మర్యాద ఇవ్వాలి. అన్ని మతాలను అంగీకరించాలి అని చెప్పేవారు. క్రిస్మస్ కు చర్చికి తీసుకెళ్లేది, మసీదుకు తీసుకెళ్లేది, టెంపుల్ కు తీసుకెళ్లేది. ఇలా మతాల విషయంలో తేడా లేకుండా పెంచారు. డిసిప్లిన్, మ్యానర్స్ ఎంతో చక్కగా నేర్చించేవారో... అదే విధంగా మాతో చిన్నపిల్లలా బిహేవ్ చేసేవారు. మాతో పాటు వర్షంలో తడవటం, స్మిమ్మింగ్ ఫూల్ లో ఆటలాడుకోవడం, కళ్లకు గంతలు కట్టుకుని మాతో ఆడుకోవడం చేసేది. ఆమె మాతో గడిపే సమయం తక్కువే అయినా ఎంతో క్వాలిటీ టైమ్‌ స్పెండ్ చేసేది అని విజయ చాముండేశ్వరి తెలిపారు.

    ఆ భయంతోనే నాకు 16 ఏళ్లకే పెళ్లి చేశారు

    ఆ భయంతోనే నాకు 16 ఏళ్లకే పెళ్లి చేశారు

    నాకు 16 సంవత్సరాలకే పెళ్లి చేశారు. అమ్మ డయాబెటిస్ ఉండేది. దాన్ని లెక్కచేయకుండా యాక్టింగులో బిజీగా గడిపేది. ఫ్యామిలీలో అప్పటికే చాలా మందికి అది ఉంది. అప్పటికీ అమ్మమ్మ కూడా చనిపోయింది. అమ్మ హెల్త్ కొంచెం అప్ సెట్ అవ్వడంతో ఆమెకు అనుమానం వచ్చింది. తనకు ఏమైనా అయితే ఈ అమ్మాయి ఏమవుతుందో? అని బెంగపెట్టుకుంది. వెంటనే నాకు పెళ్లి చేయాలని డిసైడ్ అయింది. అపుడు అందుబాటులోనే మా మామయ్య కొడుకు గోవిందరావు ఉన్నారు. ఆయన చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు అటెండ్ అవుతూ ఉండేవారు. ఆయనంటే అమ్మకు చాలా ఇష్టం. ఆయన చేతుల్లో పెడితే ఈ అమ్మాయి చాలా సేఫ్ గా ఉంటుంది అనే ఆలోచనతో నా పెళ్లి ఫిక్స్ చేసింది... అని విజయ చాముండేశ్వరి తెలిపారు.

    అలా చెప్పడం వల్లనే ఈ సినిమా తీయడానికి ఒప్పుకున్నాం

    అలా చెప్పడం వల్లనే ఈ సినిమా తీయడానికి ఒప్పుకున్నాం

    అమ్మ స్టోరీ అంటే అంతా ట్రాజెడీ అనుకుంటారు. షార్ట్ టైమ్‌లో కేవలం 45 సంవత్సరాల వయసులో ఆమె అంత పైకి ఎదిగి ఈ రోజు ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆమ్మ గురించి మాట్లాడుకుంటున్నారంటే అది అమ్మ గొప్పదనం. అమ్మ జీవితాన్ని ఒక సెలబ్రేషన్‌లా చూపిస్తామని నాగ్ అశ్విన్ నా దగ్గరికి వచ్చి చెప్పాడు. ఆమెను ట్రాజెడీ క్వీన్‌గానో, ఆమె జీవితం ఇలా అయిపోయింది అని చూపించడం కోసం కాదు అని చెప్పారు. ఆ ఒక్క మాట కోసమే ఒప్పుకున్నామని విజయ చాముండేశ్వరి తెలిపారు.

    అమ్మ గురించి చాలా మంది ఏవేవో చెప్పారు

    అమ్మ గురించి చాలా మంది ఏవేవో చెప్పారు

    ఈ రోజు ‘మహానటి'లో చూసే ప్రతీది నిజంగా జరిగిందే. దీన్లో సినిమాటిక్ గా కొంచెం కల్పన ఉంటుందేమో కానీ నిజాలను ఉన్నది ఉన్నట్లుగా చూపించారు. సినిమా స్క్రిప్టు దగ్గర నుండి ప్రతిదీ మా పర్మిషన్ తీసుకుని తీశారు. ఇప్పటి వరకు అమ్మ మీద చాలా ఆర్టికల్స్ వచ్చాయి. చాలా ఇంటర్వ్యూల్లో చాలా మంది అమ్మ గురించి చెప్పారు. అన్నింటిలో కూడా నిజాలతో పాటు అబద్దాలు ఉన్నాయి. కొందరు తెలియక చెప్పిన మాటలు ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గర నుండి మాటలు మారి మారి చివరకు అమ్మ మీద మరో రకంగా ప్రచారం జరిగింది. అలాంటివి చాలా ఉన్నాయి. ఈ మహానటిలో అమ్మ గురించి అసలు నిజాలు ఉంటాయి అన్నారు.

    అదే మహానటి స్టోరీ

    అదే మహానటి స్టోరీ

    మహానటి స్టోరీ ఏమిటీ అంటే... అమ్మ ఎలా అంత ఎత్తుకు ఎదిగింది? ఎలా ఇంత పేరు తెచ్చుకుంది? ఇప్పటికీ ఆమె మనందరికీ గుర్తుండటానికి కారణం ఏమిటి? తన వ్యక్తిత్వం ఎలాంటి? నటిగా టాలెంట్ మాత్రమే కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్‌గా ఆమె ఏమిటి? అనేది సినిమాలో ప్రజంట్ చేశారు అని విజయచాముండేశ్వరి తెలిపారు.

    అమ్మ చనిపోవడానికి కారణం

    అమ్మ చనిపోవడానికి కారణం

    అమ్మ చనిపోవడానికి కారణం డయాబెటిక్ కోమా. ఆమెకు ఎప్పటి నుండో డయాబెటిస్ ఉంది. దాంతో పాటు కోమాలోకి వెళ్లడంతో 19 నెలలు ఆసుపత్రిలో ఉన్నారు. ఆమెను కోమా నుండి బయటకు తీసుకురావాలని డాక్టర్లు చాలా ట్రై చేశారు. కానీ సాధ్యం కాలేదు. కోమాలోకి ఎందుకు వెళ్లింది, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే వివరాలు మహానటి సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ సిచ్యువేషన్స్ ఏమిటి అని నేను చెప్పలేను. సినిమాలో చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది అని విజయ చాముండేశ్వరి తెలిపారు.

    English summary
    Savitri daughter Vijaya Chamundeswari Reveals Unknown facts of her mother. Mahanati is a biographical period film based on the life of former South Indian actress Savitri. The film is produced by C. Ashwini Dutt, Swapna Dutt, Priyanka Dutt on Vyjayanthi Movies & Swapna Cinema banner and directed by Nag Aswin.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X