ఛాన్స్ దొరికితే అమ్మకు ఫ్రెండ్ కావాలని ఉంది.. సావిత్రిగారి కుమార్తె!
మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన మహానటి చిత్రం నేడు విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మూవీ క్రిటిక్స్ ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. లెజెండరీ నటి సావిత్రికి మహానటి చిత్రం ఘనమైన నివాళి అనే ప్రశంసలు దక్కుతున్నాయి.
రాజమౌళి, రాఘవవేంద్ర రావు వంటి ప్రముఖుల నుంచి చిత్ర యూనిట్ కు ప్రశంసలు దక్కాయి. కాగా మహానటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, ఆమె కుటుంబ సభ్యులు విజయవాడ అలంకార్ థియేటర్ లో మహానటి చిత్రాన్ని వీక్షించారు. ఈ చిత్రంలో అమ్మ గురించి తనకు కూడా తెలియని కొన్ని విషయాలని తెలుసుకున్నానని సంతోషం వ్యక్తం చేసారు.

ముఖ్యంగా అమ్మ చిన్నతనంలో ఎంత అల్లరిగా, చిలిపిగా ఉండేదో చాలా బాగా చూపించారని అన్నారు. ఒకవ్వేలా టైం మెషిన్ లో కాలంలో వెనక్కు వెళ్లే అవకాశం ఉంటె అమ్మ చిన్నతనానికి వెళ్లిపోతానని, అమ్మకు ఫ్రెండ్ గా మారిపోవాలని ఉందని అన్నారు. చిన్న తనంలో అమ్మ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు చాలా బాగా చేసిందని అన్నారు.


Click it and Unblock the Notifications











