వెంకటేష్ 'సావిత్రి' గా ఆమెనే ఫైనల్...షూటింగ్ ఎప్పటినుంచంటే
వెంకటేష్, తేజ కాంబినేషన్ లో 'సావిత్రి' టైటల్ తో ఓ చిత్రం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి 23 వ తేది నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రం పూజా కార్యక్రమాలు.. రెండు వారాల క్రిందట వైజాగ్ లోని రామానాయుడు స్టూడియోలోజరిగాయి. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేష్ బాబు నిర్మించనున్న ఈ చిత్రంలో త్రిషని హీరోయిన్ గా ఎంపిక చేసారు. గతంలో త్రిష,వెంకటేష్ కాంబినేషన్ లో నమో వెంకటేశ చిత్రం వచ్చి పరాజయం పొందింది. చిత్రం, నువ్వు నేను, జయం వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలు అందించిన తేజ వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న తొలిచిత్రమిది. తేజ చివరి చిత్రం కేక. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ బుద్ది మందత్వం కలిగిన పాత్రను చేస్తున్నాడని తెలుస్తోంది. చంటి తరహాలో ఈ చిత్రం విజయవంతం అవుతుందని బావిస్తున్నారు. వెంకటేష్ ప్రస్తుతం డాన్ శీను దర్శకుడుతో మళయాళ చిత్రం బాడీగార్డు రీమేక్ చేస్తున్నారు.బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











