అదంతా అబద్దం, ఇదే నిజం: ‘మహానటి’పై సావిత్రి కూతురు ఎమోషనల్

By Bojja Kumar

ప్రముఖ నటి సావిత్రి జీవితంపై తెరకెక్కిన 'మహానటి' గ్రాండ్‌గా విడుదలైంది. ఇంతకాలం ఆమెపై ఎన్నో పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. అందులో నిజం ఎంత? సావిత్రి జీవితం గురించి వాస్తవం ఏమిటి? అనే విషయాలకు తెరరూపం తెచ్చారు దర్శకుడు నాగ్ అశ్విన్. మహానటి జీవితంపై ఎంతో రీసెర్చ్ చేసి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా చూసిన అనంతరం సావిత్రి కూతురు విజయచాముండేశ్వరి ఎమోషనల్ అయ్యారు.

 ప్రతి చిన్న విషయం అడిగి తెలుసుకునేది

ప్రతి చిన్న విషయం అడిగి తెలుసుకునేది

సినిమాలో కీర్తి నటించే ముందు నాతో చాలా మాట్లాడింది. అమ్మ మేనరిజమ్స్ ఏమిటి? భోజనం చేసేపుడు ఏ చేయితో చేసేవారు? ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలుసుకుంది. ప్రతి చిన్న విషయం ఫోన్ చేసి మరీ కనుక్కునేది. రెండు మూడు సార్లు నేను షూటింగుకు కూడా వెళ్లాను. సెట్లో కూర్చుని ఉన్నపుడు తనలా నడిచి వస్తుంటే అమ్మ నడిచి వచ్చినట్లే అనిపించేది. ఈ విషయం కీర్తికి కూడా చెప్పాను. అమ్మలా నడవటం ఎలా నేర్చుకున్నావు అని అడిగితే...అదేం లేదు మామూలుగానే నడిచాను అనేది. ఈ పాత్రకు కీర్తి చాలా నేచురల్‌గా సెట్టయిపోయింది.... అని విజయచాముండేశ్వరి తెలిపారు.

అమ్మలాగే పట్టుదలకు పోయింది

అమ్మలాగే పట్టుదలకు పోయింది

కీర్తి సురేష్ తన పెర్పార్మెన్స్‌తో మహానటిని ఎలా ప్రజంట్ చేయాలో... అలా ప్రజంట్ చేసింది. ఏదైనా పాత్ర మీరు చేయలేరు అంటే అమ్మ చాలా పట్టుదలకు పోయేది. కీర్తిని ఈ పాత్రకు ఎంచుకున్నపుడు చాలా మంది ఆమెను చిన్న పిల్ల... సావిత్రి పాత్ర చేయగలదా? అన్నారు. అమ్మ ఎలా అయితే పట్టుబట్టి చేసేదో... కీర్తి కూడా అలాగే పట్టుబట్టి చేసింది. ఇపుడు అందరి మెప్పు పొందుతోంది అని విజయచాముండేశ్వరి తెలిపారు.

 అదంతా అబద్దం, ఇదే నిజం

అదంతా అబద్దం, ఇదే నిజం

సినిమా చూస్తున్నపుడు ఎమోషనల్ అయ్యాను. చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అమ్మ నిజమైన కథ బయటకు వచ్చింది. ఇంతకాలం మీడియాలో అమ్మ గురించి రాసింది అంతా నిజం కాదు. అందులో సగం నిజం ఉంటే సగం అబద్దం ఉండేది. వాళ్ల ఊహాగానాలకు తగిన విధంగా రాసేవారు. కానీ ఈ రోజు మూవీలో చూపింది అంతా అసలు నిజం. ఫ్యామిలీ దగ్గర నుండి తీసుకున్న నిజాలు. అమ్మకు సన్నిహితంగా ఉండే పెద్దవాళ్లందరినీ కలిసి నిజాలు తెలుసుకుని ఈ సినిమా తీశారని... విజయచాముండేశ్వరి తెలిపారు.

 నాకు తెలియని విషయాలు కూడా...

నాకు తెలియని విషయాలు కూడా...

చాలా విషయాలు నాకు తెలియనివి కూడా ఈ సినిమా ద్వారా నాకు తెలిశాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా రీసెర్చ్ చేసి ఈ సినిమా తీశారు. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. సెలబ్రేషన్ టైమ్‌లా అనిపిస్తోంది. ఇలాంటి తల్లి కడుపున పుట్టినందుకు గర్విస్తున్నాను అన్నారు.

ఇద్దరూ తెరపై చాలా ముచ్చటగా

ఇద్దరూ తెరపై చాలా ముచ్చటగా

సమంతకు థాంక్స్.... ఈ స్టోరీని ఆమె భుజాలమీద వేసుకుని చాలా బాగా రన్ చేశారు. చాలా క్యూట్ గా అమ్మ స్టోరీని ప్రేక్షకులకు చెప్పారు. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డిలో చూసినట్లుగా కాకుండా టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్. ఇద్దరూ తెరపై చాలా ముచ్చటగా ఉన్నారు.

అచ్చం నాన్నను చూసినట్లే ఉంది

అచ్చం నాన్నను చూసినట్లే ఉంది

దుల్కర్ గారి గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మా నాన్న రొమాంటి యాటిట్యూడ్, చిలిపితనం అంతా అతనిలో చూశాను. చాలా మంది నాన్న ఫేసుకు, ఆయన ఫేసుకు పోలిక లేదుకదా అంటారు. ఇక్కడ మొహం ముఖ్యం కాదు... పాత్ర బిహేవియర్‌ ఎలా క్యారీ చేశారు అనేది ముఖ్యం. అచ్చం నాన్నను చూసినట్లే ఉంది. అమ్మా నాన్నా లవ్ స్టోరీ తెరపై చూడటం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఆ స్టార్ వచ్చి వారి చేతిలో పడింది

ఆ స్టార్ వచ్చి వారి చేతిలో పడింది

అశ్విని దత్ గారు ఈ సినిమా తీశారు. అమ్మ నక్షత్రం అశ్విని, మా తమ్ముడు నక్షత్రం అశ్విని, సినిమాల్లోకి ఎంటరైన మా రెండో బాబు అభినయ్ నక్షత్రం కూడా అశ్విని. నాగ్ అశ్విన్‌లో కూడా ఆ పేరు ఉంది. కరెక్టుగా ఆ స్టార్ వచ్చి వారి చేతిలో పడింది. అందుకే ఈ సినిమా ఇంత బాగా వచ్చిందని అనుకుంటున్నాను... అని విజయ చాముండేశ్వరి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X