ఫస్ట్ పంచ్ అదిరిందిగా..: చైతూ సీరియస్ లుక్.. 'సవ్యసాచి'
చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న 'సవ్యసాచి' ఫస్ట్ పంచ్ రిలీజ్ అయింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ఫస్ట్ పంచ్ పేరుతో నేడు విడుదల చేశారు. ఇందులో చైతూ సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నాడు.
'సవ్యసాచి' అంటే రెండు చేతులని సమర్ధవంతంగా, శక్తివంతంగా ఉపయోగించేవాళ్లు అని అర్థం. ఆ టైటిల్ కు తగ్గట్టుగా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మాధవన్, భూమికలు ముఖ్య పాత్రలు పోషించారు.
జూన్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నిధి అగర్వాల్ ఇందులో కథానాయికగా నటిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సవ్యసాచితో పాటు మారుతి దర్శకత్వంలో శైలజా రెడ్డి అల్లుడు అనే చిత్రం చేస్తున్నాడు చైతూ. ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని టాక్. వీటి తర్వాత తన సతీమణి సమంతతోనూ ఓ ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











