దిమ్మతిరిగేలా సవ్యసాచి బిజినెస్.. చైతూ కెరీర్‌లోనే హయ్యెస్ట్.. క్రేజీ ప్రాజెక్ట్‌గా..

శైలజారెడ్డి అల్లుడు సక్సెస్ జోష్‌తో నాగచైతన్య మరోసారి సవ్యసాచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టాలీవుడ్‌కు ట్రిపుల్ బ్లాక్‌బస్టర్లను అందించిన మైత్రీ మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం నవంబర్ 2 తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది. నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ నటిస్తున్నది. కార్తీకేయ, ప్రేమమ్ చిత్రాల దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ క్రేజీగా జరుగడంతో సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఓవరాల్ ప్రీ రిలీజ్ బిజినెస్

ఓవరాల్ ప్రీ రిలీజ్ బిజినెస్

శైలజారెడ్డి అల్లుడు విజయంతో నాగచైతన్య కెరీర్‌లోనే గతంలో ఎన్నడూ లేనివిధంగా సవ్యసాచి మూవీ బిజినెస్ జరిగింది. ఓవరాల్‌గా ఈ చిత్రం రూ.22.32 కోట్ల ప్రీ బిజినెస్ రిలీజ్ జరగడం గమనార్హం.

Recommended Video

Naga Chaitanya Madhavan Starrer Savyasachi official trailer out
దిల్ రాజుకు నైజాం హక్కులు

దిల్ రాజుకు నైజాం హక్కులు

సవ్యసాచి సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నైజాంలో రిలీజ్ చేస్తున్నారు. రూ.6 కోట్లకు ఈ ప్రాంతానికి సంబంధించిన హక్కులను దక్కించుకొన్నారు. ఇక సీడెడ్‌లో ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ పంపిణీ చేస్తున్నారు. సీడెడ్ హక్కులను రూ.3.2 కోట్లకు సొంతం చేసుకొన్నట్టు సమాచారం.

 ఉత్తరాంధ్రలో హక్కులను

ఉత్తరాంధ్రలో హక్కులను

ఉత్తరాంధ్రలో సవ్యసాచి చిత్రాన్ని గాయత్రి డిస్టిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్ర హక్కులను రూ.2.2 కోట్లకు దక్కించుకొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఓం మణికంఠ రూ.1.4 కోట్లకు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎల్వీఆర్ రూ.1.1 కోట్లకు హక్కులను సొంతం చేసుకొన్నారు.

కృష్ణా, గుంటూరు జిల్లాలోని

కృష్ణా, గుంటూరు జిల్లాలోని

కృష్ణా, గుంటూరు జిల్లాల విషయానికి వస్తే కేఎఫ్‌సీ నవీన్ రూ.2.8 కోట్లకు, నెల్లూరులో భాస్కర్ రూ.0.72 కోట్లకు హక్కులను సొంతం చేసుకొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మిగితా రాష్ట్రాల థ్రియేట్రికల్ రైట్స్‌ను రూ.1.6 కోట్లకు అమ్మడం జరిగింది.

ఓవర్సీస్ మార్కెట్‌లో సవ్యసాచి

ఓవర్సీస్ మార్కెట్‌లో సవ్యసాచి

ఓవర్సీస్ మార్కెట్‌లో సవ్యసాచి చిత్రం భారీగా రిలీజ్ అవుతున్నది. ఈడబ్ల్యూ ఎంటర్‌టైనర్స్ ద్వారా ఈ చిత్రం రిలీజ్ అవుతున్నది. ఓవర్సీస్ రైట్స్‌ ద్వారా నిర్మాతలకు రూ.3.5 కోట్లు లభించినట్టు విశ్వసనీయ సమాచారం.

 కీరవాణి సంగీత దర్శకత్వంలో

కీరవాణి సంగీత దర్శకత్వంలో

నవంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న సవ్యసాచి చిత్రంలో సీనియర్ నటుడు ఆర్ మాధవన్, భూమిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రావు రమేష్, భరత్ రెడ్డి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియోకు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X