పెళ్లి మూడ్ నుండి బయటకొచ్చి...."సవ్యసాచి" షూటింగులో చైతూ (ఫోటోస్)
నాగ చైతన్య-చందు మొండేటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సవ్యసాచి’ చిత్రం షూటింగ్ మొదలైంది. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెనర్లో మాధవన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు, శ్రీనిధి అగర్వాల్ హీరోయిన్.
అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం "సవ్యసాచి". ఇన్నాళ్లు పెళ్లి మూడ్లో ఉన్న చైతన్య.... ఇపుడు ఆ మూడ్ నుండి బయటకు వచ్చి తన కొత్త సినిమా షూటింగులో బుధవారం జాయిన్ అయ్యారు.
నాగచైతన్య సరసన బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు మాధవన్ ఈ చిత్రంలో స్పెషల్ అప్పీరియన్స్ ఇవ్వనున్నారు.

ఫస్ట్ షెడ్యూల్ డీటేల్స్
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "చిలుకూరు బాలాజీ గుడి సమీపంలో ఈ సినిమా కోసం ఏర్పాటు చేసిన సెట్స్‌లో బుధవారం నుండి షూటింగ్ మొదలైంది. నాగచైతన్య, నిధి అగర్వాల్, వెన్నెల కిషోర్, సత్యల కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నాం. 15 రోజుల పాటు ఇక్కడ షూటింగ్ జరుగుతుంది' అని తెలిపారు.

డిసెంబర్ షెడ్యూల్లో మాధవన్
డిసెంబర్ లో నెక్ట్స్ షెడ్యూల్ మొదలవుతుంది. ఆ షెడ్యూల్‌లో మాధవన్ షూటింగులో జాయినవుతారు. చందు మొండేటి రాసిన సూపర్బ్ హీరో క్యారెక్టరైజేషన్ కు "సవ్యసాచి" అనేది యాప్ట్ టైటిల్ అని నిర్మాత తెలిపారు.

హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్
"ప్రేమమ్" తర్వత నాగచైతన్య-చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా "సవ్యసాచి" తెరకెక్కుతోంది. ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచే స్థాయిలో సినిమా ఉంటుందని నిర్మాత తెలిపారు.

నటీనటులు
నాగచైతన్య అక్కినేని, నిధి అగర్వాల్, మాధవన్, రావురమేష్, వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ లు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, సినిమాటోగ్రఫీ: యువరాజ్, కళ: రామకృష్ణ, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, పోరాటాలు: రామ్-లక్ష్మణ్, కో-డైరెక్టర్: చలసాని రామారావు, సి.ఈ.ఓ: చిరంజీవి (చెర్రీ), లైన్ ప్రొడ్యూసర్: పిటి.గిరిధర్, నిర్మాతలు: వై.నవీన్-వై.రవిశంకర్-మోహన్ (CVM), కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: చందూ మొండేటి.


Click it and Unblock the Notifications











