రెడీగా ఉండండి.. త్వరలోనే సవ్యసాచి ట్రీట్.. యూఎస్ వెళుతోన్న చైతు!
నాగచైతన్య నటిస్తుం లేటెస్ట్ మూవీ సవ్య సాచి. ప్రముఖ దర్శకుడు చందు ముండేటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. యాక్షన్, ఫ్యామిలీ అన్ని అంశాలు కలగలిపిన చిత్రంగా సవ్య సాచి రాబోతోంది. ఈ చిత్రంలో చైతు సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజగా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తయింది. హీరో హీరోయిన్లపై ఓ డ్యూయెట్ కోసం చిత్ర యూనిట్ అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మే 2 నుంచి 12 వరకు చైతు, నిధి అగర్వాల్ పై సాంగ్ ని యుఎస్ లో చిత్రీకరించనున్నారు. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా అక్కడ జరుగుతుంది.

షూటింగ్ పూర్తికావస్తుండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. త్వరలోనే సవ్యసాచి టీజర్ ని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. నాగ చైతన్య నటించిన చివరి చిత్రం యుద్ధం శరణం ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీనితో చైతు ఈ చిత్రంతో ఎలాగైనా అభిమానులని మెప్పించాలని భావిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











