నాగార్జునతో పోటీకి దిగిన సాయాజి షిండే

By Srikanya

క్యారెక్టర్ ఆర్టిస్టు సాయాజీ షిండే ఇప్పుడు నాగార్జుతో పోటీ పడటానికి సిద్దం అయ్యారు.నాగార్జున,రాఘవేంద్రరావు కాంబినేషన్ లో త్వరలో షిర్డీ సాయిబాబా చిత్రం తెరకెక్కనుందనే సంగతి తెలిసిందే.అయితే ఈ లోగా సాయాజీ షిండే తాను కూడా షిర్డి సాయిబాబాగా అవతారం ఎత్తటానికి సిద్దమయ్యారు.రాజవంశీ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ రూపొందనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ విషయమై షిండే మాట్లాడుతూ ..దర్శకుడు చెప్పిన కథ నచ్చింది. తొలిసారి ఓ ఆధ్యాత్మిక పాత్రలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు.

అన్నమయ్య, శ్రీరామదాసు పాత్రలతో చారిత్రిక పాత్రలకు కూడా నిండుతనం తెచ్చి నిలబెట్టిన నాగార్జున చేయబోయే బాబా పాత్రకు ఇప్పటికే క్రేజ్ వచ్చింది.ఎ ఎమ్ ఆర్ రియల్ ఎస్టేట్ గ్రూప్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.ఇక ఈ చిత్రానికి మరో విశేషం ఏమిటంటే రాఘవేంద్రరావు పర్మెనెంట్ రైటర్ జె.కె భారవి ఈచిత్రానికి రచన చేయటం లేదు.పరుచూరి బ్రదర్స్ ఈ చిత్రానికి రచన చేస్తున్నారు.ప్రస్తుతం నాగార్జున..ఢమురుకం చిత్రం షూటింగ్ లో ఉన్నారు.శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రంలో అనూష్క హీరోయిన్ గా చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X