అమితాబ్ అసభ్య ప్రవర్తన...చెంప చెల్లుమిపించాలనుకున్న హాట్ లేడీ!?

By Bojja Kumar

బాలీవుడ్ టాప్ స్టార్ అమితాబ్ బచ్చన్‌పై కేసు పెడతానంటోంది ఓ హీరోయిన్. తనను తాక కూడని చోట అమితాబ్ తాకాడని, తనతో అసభ్యంగా వ్యవహరించాడని అంటోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..? ట్రైన్ సినిమా ద్వారా బాలీవుడ్ కు పరిచయమైన సయాలీ భగవత్. ఆ సినిమాలో కుర్రకారు మత్తెక్కి పోయేలా హాట్ హాట్ గా రొమాన్స్ పండించింది. తెలుగులో బ్లేడ్ బాబ్జీ సరసన హీరోయిన్ గా కూడా నటించింది. ఓ పత్రికలో వచ్చిన వివరాల ప్రకారం ఆమె ఆరోపణలు కింది విధంగా ఉన్నాయి.

బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షైనా ఆహుజా, షాజిద్ ఖాన్, ఆర్య బబ్బర్ తను లైంగికంగా వేధించారని అంటోంది సయాలీ. టిను వర్మ రూపొందించిన 'ది వీకెండ్" ఫస్ట్ లుక్ ఆవిష్కరణలో తాను పాల్గొన్నప్పుడు అదే వేడుకకు వచ్చిన అమితాబ్‌కు తాను పాదాభివందం చేశానిని, మనవరాలి వయసున్న తనను అమితాబ్ అలా కాకుండా మరో రకంగా చూసి తాక కూడని చోట తాకాడని, ఆ సమయంలో అమితాబ్ చెంప చెల్లుమనిపించాలని అనిపించిందని చెప్పుకొచ్చింది.

నటుడు షైనీ ఆహుజా తనను లైంగికంగా వేధించాడని, హీరో ఆర్య బబ్బర్ తనకు అసభ్యమైన మెసేజ్‌లు, వెగటు పుట్టించే ఫోటోలు పంపే వాడని, దర్శకుడు సాజిద్ ఖాన్ అతని ముందు తనను నగ్నంగా నిలబడమన్నాడని....సయాలీ ఇదివరకే ఆరోపణలు చేసింది. మరి ఇంత కాలం ఈ విషయాల్ని బయట పెట్టకుండా ఇప్పుడు మాత్రమే ఎందుకు బయట పెట్టారు అని అడిగిన ప్రశ్నకు సయాలి స్పందిస్తూ.. ఇంతకాలం సినిమాల్లో కొనసాగాలనే ఒకే ఒక్క కారణంతో ఇవన్నీ భరించా... ఇక తన వల్ల కాదని, సినిమాలకు స్వస్తి చెబుతున్నానని, వారికి తగిన బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నాను, త్వరలోనే అమితాబ్‌తో పాటు ఆ ముగ్గురిపై కేసు పెట్టబోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X