twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్సువల్ వేధింపులంటూ అల్లరి నరేష్ హీరోయిన్

    By Srikanya
    |

    అల్లరి నరేష్ తో బ్లేడ్ బాబ్జీ చిత్రంలో చేసిన సయీలీ భగత్ గుర్తుండే ఉంటుంది. ఆమె తాజాగా తన తోటి నటుడు షైనీ అహూజా లైంగికంగా వేధించాడంటూ ఆరోపణ చేసింది.ఆమె తన తాజా చిత్రం ఘోస్ట్ లో చేస్తున్న షైనీ..తనతో చాలా సార్లు సినిమా షూటింగ్ లో మిస్ బిహేవ్ చేసాడని చెప్పుకొచ్చింది.ఇప్పటికే పనిమనిషితో లైంగిక గొడవల్లో కేసులో ఉన్న షైనీ ఆహూజాపై ఇది మరో వివాదం అయ్యికూర్చుంది. అయితే ఇంతకు ముందు ఆమె స్టార్ డస్ట్ వాళ్లు చాలా సార్లు ఈ విషయమై అడిగారని,తనతో షైనీ అసభ్యంగా బిహేవ్ చేసాడని రాసారని,నేను వాటిన్నటినీ ఇంటర్వూల్లో ఖండించాల్సి వచ్చింది.అలాగే వారు పత్రికలో రాసినట్లు తన బట్ ని తడమలేదని అంది.అయితే షైనీ అహూజా భార్య ఇప్పటికే తన భర్త ఇటువంటి కేసులో ఇరుక్కుని ఉండటంతో సయీలీతో మాట్లాడి..ఆమె చేత ఇవన్నీ ఏమీ లేదు..అని చెప్పించాలనుకుంటోందంటూ బాలీవుడ్ పత్రికలు రాస్తున్నాయి. ఇక సయీలీకి హిందీలోనూ పెద్దగా సినిమాలు లేవు. ఆమె చేస్తున్న ఘోస్ట్ సినిమా ఓ హర్రర్ సినిమా.

    ఇక షైనీ అహూజా...పని మనిషిని అక్రమంగా నిర్బంధించి, ఆమెపై అత్యాచారం చేసిన కేసులో పోలీసులు 109 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. నిందితుడికి, బాధితురాలికి జరిపిన వైద్య, ఫోరెన్సిక్ నివేదిలను ఈ చార్జిషీట్ తో జతపరిచారు. బాధితురాలికి ఫిర్యాదు చేయడానికి సహకరించినవారి, ఇరుగుపొరుగువారితో పాటు సాక్షుల వాంగ్మూలాలు కూడా ఉన్నాయి.బాధితురాలి వాంగ్మాలాన్ని పోలీసులు మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేశారు. జూన్ 15వ తేదీ నుంచి షైనీ అహుజా గట్టి భద్రత మధ్య ఆర్థర్ రోడ్ సెంట్రల్ ముంబై జైల్లో ఉంచారు. జూన్ 14వ తేదీన అహుజా బాధితురాలిని నీళ్ల కోసం తన గదికి పిలిచి ఆమె లోనికి రాగానే గదికి గడియ వేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు ఆరోపణ.

    English summary
    Shiney Ahuja has been once again accused of sexual harassment, this time by his co-star from his upcoming film 'Ghost'. Sayali Bhagat who features opposite Shiney in the horror film has claimed that the actor misbehaved with her a number of times during the shoot of the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X