twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరక్టర్ సెక్స్ కోరాడంటూ అల్లరి నరేష్ హీరోయిన్

    By Srikanya
    |

    బాలీవుడ్ హాట్ హీరోయిన్ సయాలీ భగత్(బ్లేడ్ బాబ్డీ ఫేమ్) తాను దర్సకుడు సాజిద్ ఖాన్ నుంచి లైంగిక వేధింపులను ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ మీడియా వద్ద వాపోయింది. ఆమె మాట్లాడుతూ...నేను హౌస్ ఫుల్ చిత్రాన్ని సాజిద్ ఖాన్ చేస్తున్నప్పుడు ఆయన ఆఫీసుకు వెళ్లి కలిసాను. నాకు కాస్టింగ్ కోచ్ ల గురించి తెలుసు.కానీ సాజిద్ ఖాన్ కూడా కాస్టింగ్ కోచ్ లాగ బిహేవ్ చేస్తాడనుకోలేదు.అతను నన్ను బట్టలు విప్పతీసి సెక్స్ లో పాల్గొనమని,ఆ ఆఫీసులో అక్కడే చెయ్యాలని బలవతం చేసాడు.నేను అరిచి ఆ బిల్డింగ్ నుంచి బయిటపడ్డాను. నేను ఎప్పుడూ అతనితో ఆ తర్వాత పనిచేయలేదు.అతన్ని కలవలేదు అంటూ తన చేదు అనుభవాన్ని వివరించింది. కొద్ది రోజుల క్రిందట ఆమె తన సహనటుడు షైనీ అహూజా లైంగికంగా వేధించాడంటూ ఆరోపణ చేసింది.

    ఆమె తన తాజా చిత్రం ఘోస్ట్ లో చేస్తున్న షైనీ..తనతో చాలా సార్లు సినిమా షూటింగ్ లో మిస్ బిహేవ్ చేసాడని చెప్పుకొచ్చింది.ఇప్పటికే పనిమనిషితో లైంగిక గొడవల్లో కేసులో ఉన్న షైనీ ఆహూజాపై ఇది మరో వివాదం అయ్యికూర్చుంది. అయితే ఇంతకు ముందు ఆమె స్టార్ డస్ట్ వాళ్లు చాలా సార్లు ఈ విషయమై అడిగారని,తనతో షైనీ అసభ్యంగా బిహేవ్ చేసాడని రాసారని,నేను వాటిన్నటినీ ఇంటర్వూల్లో ఖండించాల్సి వచ్చింది.అలాగే వారు పత్రికలో రాసినట్లు తన బట్ ని తడమలేదని అంది.అయితే షైనీ అహూజా భార్య ఇప్పటికే తన భర్త ఇటువంటి కేసులో ఇరుక్కుని ఉండటంతో సయీలీతో మాట్లాడి..ఆమె చేత ఇవన్నీ ఏమీ లేదు..అని చెప్పించాలనుకుంటోందంటూ బాలీవుడ్ పత్రికలు రాస్తున్నాయి. ఇక సయీలీకి హిందీలోనూ పెద్దగా సినిమాలు లేవు. ఆమె చేస్తున్న ఘోస్ట్ సినిమా ఓ హర్రర్ సినిమా.

    English summary
    “I remember the time when Sajid Khan was casting for Housefull, he had called me to his office for a meeting. I understand that the casting couch is a prevalent reality in the film industry but I never expected Sajid to strip naked in front of me asking me to have sex with him in his office right there and then. I screamed and left his building. Obviously, I never worked with him---Sayali Bhagat
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X