twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘దోస్తానా'కు బన్నీ నో...

    By Staff
    |

    నటలోనే కాకుండా బయటకూడా చాలా స్పీడ్ గా కనిపించే అల్లు అర్జున్ ను బాగా తెలిసిన వారు 'పార్టీ పక్షి' అంటుంటారు. లేట్ నైట్ పార్టీలు, పబ్ లను ఆయన ఎక్కువగా ఇష్టపడుతుండటమే ఇందుకు కారణం. యంగ్ లేడీస్ లోనూ అల్లు అర్జున్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. స్టయిలిష్ హీరోగా ఉన్న పేరు నిలబెట్టుకుంటూ హెయిర్ నున్నగా వెనక్కి దువ్వి క్లిప్ లు పెట్టుకుని ఒకటి రెండు ఫంక్షన్లలోనూ ఆయన ఈమధ్య దర్శనమిచ్చారు. ఇంకే...గాసిప్ మాంగర్స్ కు చేతినిండా పని పడింది. బాలీవుడ్ కామెడీ ఎంటర్ టైనర్ 'దోస్తానా' రీమేక్ లో అల్లు అర్జున్ నటించబోతున్నారనీ, ఇందులో 'గే' పాత్రలో ఆయన కనపించబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. నెట్ వార్తల సందడి చూసి ఒకటి రెండు ఛానెల్స్ కూడా ప్రోగ్రామ్స్ అల్లేశాయి. పురుష్య లింగ సంపర్కుల (గేలు) చుట్టూ తిరిగే 'దోస్తానా' రీమేక్ లో ఒరిజనల్ వెర్షన్ లో నటించిన అభిషేక్ బచ్చన్ పాత్రను అల్లు అర్జున్ పోషించనున్నారనీ, జాన్ అబ్రహం పాత్రను రాజా పోషిస్తారనీ పుకార్లు షికారు చేశాయి. ఈ వార్త అల్లు అర్జున్ కు కూడా చేరడంతో ఆయన నవ్వుతూ 'అలాంటి ప్రపోజల్ ఏదీ లేదు' అంటూ కొట్టిపారేశారు.

    ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాననీ, మూడు చిత్రాలకు కమిట్ అయ్యాననీ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. సుకుమార్ దర్శకత్వంలో 'ఆర్య-2', గుణశేఖర్ దర్శకత్వంలో ఒక చిత్రం, క్రిష్ 'వేదం'లో నటిస్తున్నాననీ, వి.వి.వినాయక్ దర్శకత్వంలో 'బద్రీనాథ్' చిత్రం చేసే ఆలోచన కూడా ఉందనీ చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ కాదంటున్నాడు కాబట్టి ఇంకెవరైనా 'దోస్తానా'కి ట్రై చేస్తారేమో చూడాలి...

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X