twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో గోవిందా ని క్షమాపణ చెప్పమన్న సుప్రీంకోర్టు

    By Srikanya
    |

    ముంబై‌: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు గోవిందాకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. 2008లో ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టిన కేసులో బాధితుడికి క్షమాపణలు చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం ఈ హీరోకు సూచించింది.

    వివరాల్లోకి వెళితే...గోవిందా గతంలో సంతోష్‌ రాయ్‌ అనే వ్యక్తిపై దాడి చేశాడు. దీనికి సంబంధించిన కేసును ముంబయి హైకోర్టు కొట్టివేసింది. దీంతో రాయ్‌ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

    SC asks actor Govinda to apologise to person for slapping him

    జస్టిస్‌ టి.ఎస్‌.ఠక్కర్‌ నేతృత్వంలోని ధర్మాసనం వీడియో క్లిప్‌లను పరిశీలించిన తర్వాత గోవిందాకు ఈ సూచన చేసింది. రీల్‌లైఫ్‌ లో చేసినట్లు రియల్‌ లైఫ్‌లో చేయకూడదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

    'మేము మీ సినిమాలను చూసి ఆనందిస్తాం.. కానీ మీరు ఇలా నిజజీవితంలో ఎవరినైనా చెంపదెబ్బ కొడితే హర్షించలేము'అని ఆయన అన్నారు. ప్రజల మనిషిగా ఉండేవారు ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని సూచించారు. వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోమని సలహా ఇచ్చారు. అనంతరం విచారణను ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా వేశారు.

    English summary
    The Supreme Court on Monday asked noted Bollywood actor Govinda, who had allegedly slapped a person in 2008, to apologise to the victim.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X