twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘పద్మావత్’ వివాదం: బీజేపీ పాలిత రాష్ట్రాలకు సుప్రీం కోర్టు షాక్!

    By Bojja Kumar
    |

    Recommended Video

    ‘పద్మావత్’ వివాదం పై.. బీజేపీ పాలిత రాష్ట్రాలకు సుప్రీం కోర్టు షాక్ !

    సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన 'పద్మావతి' చిత్రంపై కొన్ని రోజులుగా వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ వివాదాలన్నీ దాటుకుని, సెన్సార్ అడ్డంకులు తొలగించుకుని.... 'పద్మావత్' గా పేరు మార్చుకుని జనవరి 25న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని..... రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలు శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో అడ్డుకోవడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది.

     ‘పద్మావత్' అడ్డుకోవడానికి వీల్లేదు

    ‘పద్మావత్' అడ్డుకోవడానికి వీల్లేదు

    శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడాల్సిన బాధ్య‌త రాష్ట్రాల‌దేన‌ని, ఆ కార‌ణంతో ‘పద్మావత్' సినిమా విడుద‌లను అడ్డుకోవ‌డం తగదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది.

     నిర్మాతలకు అనుకూలంగా తీర్పు

    నిర్మాతలకు అనుకూలంగా తీర్పు

    ఆయా రాష్ట్రాల్లో నిషేదం నేపథ్యంలో ‘పద్మావత్‌' నిర్మాతలు సుప్రీం కోర్టులో బుధవారం పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో సుప్రీం గురువారం తీర్పునిస్తూ ఐదు రాష్ట్రాల్లో సినిమాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఆదేశించింది.

     దేశ వ్యాప్తంగా విడుదలవుతున్న పద్మావత్

    దేశ వ్యాప్తంగా విడుదలవుతున్న పద్మావత్

    సుప్రీం కోర్టు తీర్పుతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం ఎంతో మంది సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు.

     మొదటి నుండి అడ్డంకులే

    మొదటి నుండి అడ్డంకులే

    సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి మొద‌ట్నుంచి ఆటంకాలే ఎదుర‌వుతున్నాయి. రాజ్‌పుత్ రాణుల ఆత్మ‌గౌర‌వానికి భంగం క‌లిగించేలా సినిమా ఉండ‌బోతోంద‌ని క‌ర్నిసేన, కొన్ని హిందూ సంఘాలు ఈ చిత్రంపై ఆందోళన చేయడంతో సెన్సార్ బోర్డు చరిత్ర కారుల సమక్షంలో ఈ చిత్రాన్ని సెన్సార్ చేసి సర్టిఫికెట్ జారీ చేసింది.

     రూ. 200 కోట్ల బడ్జెట్

    రూ. 200 కోట్ల బడ్జెట్

    దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో ‘పద్మావత్' చిత్రాన్ని నిర్మించారు. దీపిక పదుకోన్ ఈ సినిమాలో రాణి పద్మావతి పాత్రలో నటించారు. పద్మావతి భర్త మహారావల్‌ రతన్‌ సింగ్‌ పాత్రలో షాహిద్‌ కపూర్‌, అల్లావుద్దీ‌న్‌ ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటించారు.

    English summary
    The Supreme Court on Thursday stayed the ban on the release of the film 'Padmaavat' imposed by four states, allowing for an all-India release on January 25.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X