సీబీఐపై యూటర్న్ ఎందుకు? రియా చక్రవర్తికి సుప్రీంకోర్టు మొట్టికాయ

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన దర్యాప్తును సీబీఐకి అప్పగించడంపై రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదోపవాదనలను వేడివాడిగా జరుగుతున్నాయి. సీబీఐ దర్యాప్తుపై మాట మార్చడంపై రియా తరుఫు న్యాయవాదికి సుప్రీం కోర్టు చురకలు అంటించింది. సీబీఐ దర్యాప్తు వ్యతిరేకించడంపై మీ అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయంటూ కోర్టు వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించిన కీలక వివరాలు..

Recommended Video

Sushant Singh Rajput దేహం సీలింగ్‌కు వేలాడలేదు.. ముమ్మాటికి హత్యే.. సీఎం కొడుకు హస్తం? -వికాస్ సింగ్

కోర్టు విచారణకు ప్రముఖ లాయర్లు

కోర్టు విచారణకు ప్రముఖ లాయర్లు

సుశాంత్ మరణం కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ రియా చక్రవర్తి దాఖలు చేసిన తాజా పిటిషన్‌పై వాదనలు జరిగాయి. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ, బీహార్ తరుఫున మనిందర్ సింగ్, రియా తరఫున శ్యామ్ దీవాన్, సుశాంత్ సింగ్ తరుఫున వికాస్ సింగ్ కోర్టు విచారణలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పాల్గొన్నారు.

ముంబై పోలీసుల దర్యాప్తు పారదర్శకంగా

ముంబై పోలీసుల దర్యాప్తు పారదర్శకంగా

సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా రియా చక్రవర్తి తరుఫు న్యాయవాది శ్యామ్ దివాన్ స్పందిస్తూ.. ఈ కేసులో ఇప్పటి వరకు 56 మందిని విచారించారు. ఈ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తు పారదర్శకంగా, స్వేచ్ఛగా ఎలాంటి ఒత్తిడులు లేకుండా సాగుతున్నది. ముంబై పోలీసులకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాను అని అన్నారు.

బీహార్ సర్కార్ సూచనలు తీసుకోవద్దు

బీహార్ సర్కార్ సూచనలు తీసుకోవద్దు

సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే సుశాంత్ మరణం కేసులో దర్యాప్తును సిబీఐకి అప్పగించాలి. ఈ కేసులో ఘటన జరిగింది ముంబైలో కాబట్టి సంఘటనా స్థలం పరిధిని దర్యాప్తు పరిధిలోకి తీసుకోవాలి. బీహార్ ప్రభుత్వ ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవద్దు అని రియా తరఫు న్యాయవాది శ్యామ్ దివాన్ చెప్పారు.

రాజకీయ పార్టీల జోక్యంతో

రాజకీయ పార్టీల జోక్యంతో

సుశాంత్ సింగ్ మరణం కేసు ఇప్పుడు బీహార్, మహారాష్ట్రల మధ్య రాజకీయాలకు వేదికగా మారింది. రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాల కోసం ఈ కేసును ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు ఓ రాష్ట్రానికి సంబంధించిన సీఎం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని రియా తరఫు న్యాయవాది చెప్పారు. ఈ కేసును నిజాయితీతో దర్యాప్తు చేసే సంస్థకు అప్పగించాలని అన్నారు.

 ఇంతకు సీబీఐ దర్యాప్తు కావాలా? వద్దా?

ఇంతకు సీబీఐ దర్యాప్తు కావాలా? వద్దా?

రియా తరుఫు న్యాయవాది వాదనలు విన్న సుప్రీంకోర్టు.. తీవ్రంగా స్పందించింది. సుశాంత్ మరణం కేసులో మీ క్లయింట్ సీబీఐ దర్యాప్తు కోరింది. ఇప్పుడు సీబీఐ దర్యాప్తు చేపట్టడానికి ముందుకొస్తే.. ఎలా దర్యాప్తు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. అంతలోనే మాటల్లో ఇంత వ్యత్యాసం ఎందుకు? లీగల్ అంశాన్ని కాస్త పక్కన పెడుతా.. ఇంతకు ఈ కేసును సీబీఐకి అప్పగించాలా? లేదా? అని కోర్టు ప్రశ్నించినట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X