సల్మాన్ జింక వేట కేసు: సుప్రీం తీర్పు రిజర్వ్
ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ‘కృష్ణ జింక'ల కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును వాయిదా వేసింది. 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్ అడవుల్లోకి వెళ్లిన సల్మాన్ ఖాన్ సహ నటులు సోనాలి బెంద్రె, టబు, నీలమ్ లతో కలిసి కృష్ణ జింకలను వేటాడారన్న అరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఇతర నటుల పాత్రపై రాజస్థాన్ పోలీసులకు ఆధారాలు లభించకపోయినా, సల్మాన్ ప్రమేయంపై ఆధారాలు లభ్యమయ్యాయి. దీంతో అతడికి జైలు శిక్ష విధిస్తూ రాజస్థాన్ లోని కోర్టు తీర్పు చెప్పింది.
అయితే ఈ శిక్షపై గతేడాది రాజస్థాన్ హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ముఖోపాధ్యాయ, జస్టిస్ గోయల్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వులో పెట్టింది.

1998 అక్టోబర్ లో జోధ్‌పూర్‌లోని కంకణి గ్రామంలో రెండు కృష్ణ జింకలను వేటాడి చంపినట్లు సల్మాన్ ఖాన్ పై కేసు నమో దైంది. ''హమ్ సాథ్ సాథ్ హై'' సినిమా షూటింగ్ సందర్భంగా సైఫ్ అలీఖాన్, సోనా లీ బింద్రే, టాబు, నీలంలతో కలిసి షూటింగ్ లో పాల్గొన్న సల్మాన్ అడవి జింకలను వేటాడినట్లు అభియోగం. అంతరించిపోతున్న జంతువులను వేటాడి చంపారంటూ సల్మాన్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.
సల్మాన్ ప్రధాన నిందితుడుగా పేర్కొంటూ ట్రయల్ కోర్టు ఆయనకు అయిదేళ్ళ జైలు శిక్ష విధించింది. 2006 ఫిబ్రవరిలో అడవి జంతువుల సంరక్షణ చట్టంకింద కోర్టు సల్మాన్ ను దోషిగా నిర్ధారించింది. అలా ఈ కేసు ట్రయల్ కోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు వచ్చింది.


Click it and Unblock the Notifications











