నిర్మాత బండ్ల గణేష్‌పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు: కులం పేరుతో దూషించాడని?

నిర్మాత బండ్లగణేష్, అతని సోదరుడు శివబాబులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌కు చెందిన డాక్టర్ దిలీప్ చంద్ర, కౌన్సిలర్ అయిన అతని భార్య కృష్ణవేణి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫరూఖ్ నగర్ మండలం, బూర్గుల శివారులో ఉన్న పౌల్ట్రీ ఫామ్‌ల విషయంలో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ భూములు దిలీప్‌చంద్ర‌కి చెందినవి కాగా.. విక్రయం కోసం ఇటీవల బండ్ల గణేశ్‌తో ఒప్పందం జరిగింది.

అయితే అప్పటికే ఆ భూములపై బ్యాంకుల్లో రుణాలు ఉండటంతో.. ఆ డబ్బు చెల్లించిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా బండ్ల గణేశ్ కు దిలీప్ చంద్ర దంపతలు సూచించారు.

sc,st Atrocities case against Bandla Ganesh?

ఒప్పంద పత్రంలోనూ అదేవిధంగా రాసుకున్నారు. కానీ బ్యాంకు ఇచ్చిన గడువులోగా గణేష్ రుణాలను తిరిగి చెల్లించలేదు. దీంతో బ్యాంకు అధికారులు ఆ పౌల్ట్రీ ఫామ్‌లతో పాటు దిలీప్ చంద్రకు చెందిన ఇంటిని కూడా సీజ్ చేశారు. దీంతో తమకు రావాల్సిన డబ్బుల కోసం దిలీప్ చంద్ర, ఆయన భార్య, కౌన్సిలర్ కృష్ణవేణితో కలిసి గణేష్‌ పౌల్ట్రీ ఫామ్‌ ఆఫీసుకు వెళ్లారు.

Recommended Video

పళ్లు రాలగొడతా..అంటూ ఫైర్ !

ఆ సమయంలో గణేష్, అతని సోదరుడు శివబాబు కులం పేరుతో తమను దూషించారంటు కౌన్సిలర్ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిరువురిపై అట్రాసిటీ కేసు నమోదైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X