ఎస్సీ, ఎస్టీ కేసు విచారణలో భాగంగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్, పాండురంగారావులను బంజారహిల్స్ ఎసీపీ ముందు హాజయ్యారు. ఎసీపీ కథనం ప్రకారం ఫిలింనగర్ నివాసి, దేవి మూవీస్ అధినేత ఎస్ జెరత్నావత్...స్వీట్ హార్ట్ అనే పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా శాటిలైట్ రైట్స్ ఐశ్వర్యా క్రియేషన్ నిర్వాహకులు పాండురంగారావు, బెల్లంకొండ సురేష్ యాభై లక్షల రూపాయలకు కొనుగోలు చేసారు. అడ్వాన్స్ కొంత డబ్బు ఇచ్చారు. మిగతా డబ్బు ఇవ్వటం లేదు. డబ్బు అడిగేందుకు ఐశ్వర్యా క్రియేషన్స్ కు వెళ్ళగా బెల్లంకొండ సురేష్, పాండురంగారావు కులం పేరుతో దూషించారని పేర్కొంటూ రత్నావత్ గత నెల పదవ తేదీన ఫిర్యాదు చేసారని ఏసీపీ తెలిపారు. దర్యాప్తులో భాగంగా మంగళవారం ఇద్దర్నీ రప్పించి విచారించినట్లు తెలిపారు.