twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్,వినాయిక్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

    By Srikanya
    |

    హైదరాబాద్ : రామ్ చరణ్, వివి వినాయిక్ కాంబినేషన్ లో వచ్చిన నాయక్ చిత్రం నిన్న(బుధవారం)భారీగా విడుదలై సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి టైటిల్ వివాదం మాత్రం తీరటం లేదు. లంబాడాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న నాయక్‌ సినిమాను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘ నాయకులు కరాటే రాజు, నెహ్రూనాయక్‌, రవీందర్‌ డిమాండ్‌ చేశారు. గిరిజనుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న నాయక్‌ సినిమా హీరో రామ్‌చరణ్‌, దర్శకుడు, నిర్మాత, యూనిట్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఓయూ పోలీస్‌స్టేషన్‌ ఫిర్యాదు చేశారు. గతంలో నాయక్‌ సినిమా విషయంలో వినతి పత్రం సమర్పించినా సంబంధిత సంస్థలు స్పందించలేదన్నారు.

    మరో ప్రక్క నాయక్ చిత్రంలో విలన్ పేరు మార్చాలంటూ విశాఖ జిల్లా మాజీ శాసనసభ్యుడు గండి బాబ్జీ బుధవారం ఆందోళనకు దిగారు. చిత్రంలో విలన్ పాత్రకు తన పేరును పోలిన పేరు ఉండటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పేరును వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. ఆ పేరును ఉద్దేశ్యపూర్వకంగానే పెట్టినట్లుగా బాబ్జీ అభిప్రాయపడ్డారు.

    గండి బాబ్జీ బుధవారం జిల్లాలోని పెందుర్తిలో ఆందోళనకు దిగారు. తక్షణమే పేరు మార్చాలని అతను నిర్మాతను, దర్శకుడిని కోరారు. రేపటిలోగా సినిమాలో విలన్ పాత్రధారి పేరు మార్చాలన్నాడు. లేదంటే దర్శకుడి పైన తాను క్రిమినల్ కేసు పెట్టేందుకు కూడా వెనుకాడే ప్రసక్తి లేదన్నాడు. కాగా ఇందుకు సంబంధించి గండి బాబ్జీ దర్శకుడు వివి వినాయక్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లుగా సమాచారం. వినాయక్ సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

    వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన నాయక్ చిత్రాన్ని యూనివర్సల్‌ మీడియా సంస్థ నిర్మించిది. డి.వి.వి.దానయ్య నిర్మాత. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ హీరోయిన్స్ గా చేసారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌ రెడ్డి, రాహుల్‌ దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌ రావత్‌, సుధ తదితరులు నటించారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.

    English summary
    Ram Charan-starrer ‘Naayak’ has landed in a title row. A section of Girijan Student Association has demanded the producer Danayya to immediately rename the film or face stringent action. They demand ..to registar SC/ST Atrocity Case Against Ramcahran teja,V V Vinayak and Nayak Unit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X