టాలీవుడ్ నిర్మాతల మండలిలో అవినీతి ‘స్కాం’

నిర్మాతల మండలి వారంతో ఓ భీమా సంస్థ ద్వారా.... మండలిలో సభ్యులుగా ఉన్న వారి పేరు మీద పాలసీలు చేసారు. ఏ నిర్మాతకైనా ఆరోగ్య సమస్య వస్తే సదరు భీమా కంపెనీ రూ. 2 లక్షల వరకు ఆసుపత్రి ఖర్చులు భరిస్తుంది. అంతకంటే ఎక్కువ ఖర్చయితే నిర్మాతల మండలి సమావేశం అయి మండలి తరుపున ఎంత డబ్బు మంజూరు చేయాలనే విషయమై నిర్ణయం తీసుకుంటుంది.
అయితే కార్యదర్శి ప్రసన్న కుమార్... కొన్ని ఫేక్ రికార్డులు సృష్టించి ఇతర నిర్మాతల పేరుతో డబ్బులు డ్రా చేసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని కొందరు నిర్మాతలు సాక్షాలతో సహా నిరూపించారని టాక్. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రసన్న కుమార్ ను ఆ పదవి నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. అవసరం అయితే పోలీస్ కేసు కూడా పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే కార్యదర్శి ప్రసన్న కుమార్ మాత్రం తాను ఏ అవినీతికి పాల్పడలేదని, విచారణలో అన్ని విషయాలు తేలుతాయని అంటున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ విషయం ఓ కొలిక్కి రానుంది.


Click it and Unblock the Notifications











