twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కెమెరామెన్ గంగతో...' ఐటం గర్ల్ మళ్లీ ...

    By Srikanya
    |

    హైదరాబాద్: పవన్ కళ్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' లో ఐటం గర్ల్ గా చేసిన స్కార్లెట్ విల్సన్‌ అప్పట్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ 'ఎవడు' లో ఐటం సాంగ్ చేసిన ఆమె మరో చిత్రం లో కూడా తన అందాలు ప్రదర్శించనుంది.
    ప్రియమణి హీరోయిన్ గా సముద్ర దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'చండి' చిత్రం కోసం శనివారం నుంచి ఓ ఐటెం సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు.

    Scarlett Wilson
    సహ నిర్మాత సత్యం ముమ్మిడి మాట్లాడుతూ... 'ప్రియమణి తొలిసారిగా యాక్షన్ పాత్రలో నటిస్తున్న సినిమా ఇది. అశోకగజపతిరాజుగా కృష్ణంరాజు చేస్తున్న పాత్ర అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం ఐటెం సాంగ్ తీస్తున్నాం. ఇందులో ఆశిష్ విద్యార్థి కూడా పాల్గొంటారు. టాకీ పార్ట్ పూర్తయింది. మిగిలిన పాటను త్వరలో విదేశాల్లో తీస్తాం. ప్రస్తుతం డబ్బింగ్ కూడా జరుగుతోంది' అన్నారు. డాక్టర్ శ్రీనుబాబు జి. నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృష్ణంరాజు, శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ...చండీలో ప్రియమణి తండ్రిగా, ఊరి పెద్దగా, స్వాతంత్ర్య సమరయోధిడిగా కృష్ణం రాజు పవర్ ఫుల్ రోల్ చేసారు' అని తెలిపారు. గతంలో కృష్ణరాజు చేసిన బొబ్బిలి బ్రహ్మన్న, పల్నాటి పౌరుషం, తాండ్ర పాపారాయుడు రేంజిలో అశోక్ గజపతి రాజు పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.

    ఒక సామాన్యురాలు మంత్రిగా ఎలా ఎదిగింది? అనేది ఈచిత్ర కథాంశం 3 విభిన్న కోణాలు, గెటప్‌లు నా ప్రియమణి పాత్రలో కనిపిస్తాయి. ప్రత్యేక ఆర్థిక మండళ్లు(ఎస్‌ఇజడ్‌) నేపథ్యంలోని కథాంశమిది. ఈచిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణకు రెడీ అవుతోంది. ఆశిష్ విద్యార్థి, సుప్రీత్, రంగనాథ్, నాగేంద్రబాబు, వినోద్‌కుమార్‌, పోసాని కృష్ణమురళి, తాగుబోతు రమేష్, అలీ, తెలంగాణ శకుంతల తదితరులు నటిస్తున్నారు. కెమెరా: వాసు, సంగీతం: ఎస్‌.ఆర్‌.శంకర్‌, చిన్నా, ఎడిటింగ్‌: నందమూరి హరి, కళ: వెంకటేశ్వర్లు మల్లెల, కథ-మాటలు: కరణం పి.బాబ్జీ, సహనిర్మాత: సత్య ముమ్మిడి, కథనం-దర్శకత్వం: వి.సముద్ర.

    English summary
    London born Scarlett Wilson who recently danced to hit number 'joromocchindi' in puri jagan's Cameraman GangaTho Rambabu has done her second item number in Telugu. She is currently shooting for a raunchy item song in Samudra directed Primani starrer..Chandi .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X