నాగార్జున ‘లవ్ స్టోరీ’లో జాయినైన నయన

By Bojja Kumar

గ్లామర్ డాల్ నయన తార నాగార్జున హీరోగా రూపొందుతోన్న 'లవ్ స్టోరీ' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ పక్షం రోజుల క్రితమే ప్రారంభం అయింది. నాగార్జున ఇతర నటులపై పలు సీన్లు చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈచిత్రం షూటింగులో నయనతార జాయిన్ అయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వీరిపై సీన్లు చిత్రీకరిస్తున్నారు.

గతంలో నయనతార, నాగార్జున 'బాస్' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇది వారి రెండో చిత్రం. అదే విధంగా ఈచిత్రంలో మీరా చోప్రా కూడా ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఇందులో నాగార్జున ఓ ఎన్నారైగా కనిపించనున్నారు. గతంలో నాగార్జునతో 'సంతోషం' చిత్రానికి దర్శకత్వం వహించిన దశరత్ ఈచిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. కామాక్షి మూవీ బ్యానర్ పై చందన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

నాగార్జున ఇమేజ్‌కి తగిన విధంగా డైరెక్టర్ దశరథ్ ఈ సబ్జెక్టుని అద్భుతంగా రూపొందించారు. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రాన్ని డిసెంబర్లో గానీ, జనవరిలోగానీ రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

నాగార్జున, నయనతార జంటగా నటిస్తున్న ఈచిత్రానికి ఫోటోగ్రఫీ : అనిల్ బండారి, సంగీతం : థమన్, ఆర్ట్ : ఎస్. రవీందర్, ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్, కో-డైరెక్టర్ : కె. సదాశివరావు, స్క్రీన్ ప్లే : హరి కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే : ఎం.ఎస్.ఆర్ : ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వివేక్, కో ప్రొడ్యూసర్ : డి. విశ్వచందన్ రెడ్డి, నిర్మాత : డి. శివప్రసాద్ రెడ్డి, కథ-దర్శకత్వం : దశరథ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X