సైన్ పిక్షన్ తెలుగు ‘అంబులి-3డి’ కథేంటి?

By Srikanya

హైదరాబాద్: తమిళంలో ఘనవిజయం సాధించిన 'అంబులి త్రీడీ' చిత్రం తెలుగులో కూడా రానున్న సంగతి తెలిసిందే. పార్తిబన్, అజయ్, శ్రీజిత్, సనమ్, జగన్, గోకుల్‌నాథ్, ఉమా, రియాజ్‌ఖాన్, బాలసింగ్ ముఖ్యతారలుగా నటించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. హరిశంకర్, హరీష్ నారాయణ దర్శకులు. కేటీవీఆర్ లోకనాథరెడ్డి సమర్పణలో కేటీవీఆర్ క్రియేటీవ్ రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనుంది.

ఈ చిత్రం కథ ఏమిటంటే...'వంద సంవత్సరాల మానవుడి ఆయుష్షుని, 150 సంవత్సరాలుగా మార్చడానికి ఒక తెల్లదొర గర్భవతి అయిన ఓ పల్లెటూరి స్త్రీ మీద తన పరిశోధనని కొనసాగిస్తూ వుంటాడు. ఆ స్త్రీ సూర్యక్షిగహణం రోజున బయటికి రావడంతో ఆయన ప్రయోగం వికటించి ఒక వింత ప్రాణి జన్మకు కారణమవుతుంది. కాలక్రమేణా ఆ ప్రాణి బూచోడంటి అంబులిగా మారి ఏం చేసిందనేదే సినిమా. ఆ ప్రాణి అంబులిగా మారి ప్రజల్ని ఎంతగా భయపెట్టాడన్నదే ఈ'అంబులి-3డి' చిత్ర కథాంశం'.

నిర్మాత లోకనాథరెడ్డి మాట్లాడుతూ -'' ఇదొక సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్, పల్లెటూరులో జరిగిన ఆసక్తికరమైన సంఘటనల సమాహారమే ఈ సినిమా. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిదిమంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను అనువదిస్తున్నాం. తమిళంలో అఖండ విజయం సాధించిన సినిమా ఇది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సినిమా సాగుతుంది. హాలీవుడ్ సాంకేతిక విలువలతో ఈ చిత్రం తెరకెక్కింది. త్రీడీ టెక్నాలజీ అద్భుతంగా ఉంటుంది. కుటుంబ సమేతంగా ఈ సినిమా చూడొచ్చు'' అన్నారు. పార్తీబన్ మాట్లాడుతూ -''తమిళనాట మా టీమ్ మొత్తానికి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలుగులో కూడా ఈ సినిమా అదే ఫలితాన్నిస్తుందని ఆశిస్తున్నాం'' అన్నారు.

దర్సకుడు మాట్లాడుతూ... ''మన దేశంలో త్రీడీ చిత్రాలు అరుదుగా వస్తున్నాయి. ఇప్పటివరకూ వచ్చిన త్రీడీ చిత్రాలన్నింట్లోకెల్లా కంటెంట్ పరంగా, క్రియేటివిటీ పరంగా చాలా అద్భుతంగా 'అంబులి-3డి' రూపొందింది. ఇందులో ప్రతి సన్నివేశమూ అద్భుతంగా ఉంటుంది. ఇదొక సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్. పల్లెటూరులో జరిగిన ఆసక్తికరమైన సంఘటనల సమాహారమే ఈ సినిమా. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది'' అని తెలిపారు. ఇక ''కొత్తదనం కోసం ఈ కథ ఎంచుకున్నాం. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో సినిమా ఉంటుంది. ఇందులో జి.సతీష్ కెమెరా యాంగిల్స్ భిన్నంగా ఉంటాయి. తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం'' అని చెప్పారు. అజయ్, శ్రీజిత్, సనమ్, జగన్, గోకుల్‌నాథ్, ఉమా, యాజ్‌ఖాన్, బాలాసింగ్ ఇందులో ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్.జి, సంగీతం: వెంకట్‌ప్రభుశంకర్, సీఎస్ శామ్, సతీష్, మెర్విన్ సాల్మన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X