స్క్రీన్ ప్లే ప్రధానంగా సాయి ధరమ్ తేజ్ చిత్రం
హైదరాబాద్ : సాయి ధరమ్ తేజ్ హీరోగా ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'పిల్లా నువ్వు లేని జీవితం..'.
అనే టైటిల్ ఖరారు చేసారు. దీనికి అల్లు అరవింద్, దిల్‌రాజు నిర్మాతలు. ఆదివారం ఈ దర్శకుడి పుట్టిన రోజు ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు.
దర్శకుడు మాట్లాడుతూ...''ఏం పిల్లో.. తరవాత కొంత విరామం తీసుకొన్నా. కాకపోతే చాలా కథలు రాసుకొన్నా. నేను బతకడానికైతే విరామం లేకుండా సినిమాలు చేసేవాడిని. కానీ నా స్నేహితులు మంచి కథతో సినిమా తీయమని సూచించారు. అందుకే ఈ ఆలస్యం. ఆ కొత్తదనాన్ని సాయిధరమ్ తేజ్ సినిమాలో చూస్తారు. ఇది స్క్రీన్‌ప్లేలో కొత్త ఒరవడి సృష్టిస్తుందనే నమ్మకం ఉంది. చాలా భాగం రామోజీ ఫిల్మ్‌సిటీలోనే తెరకెక్కించాం. ఒకే ఒక్క పైట్ సీన్ మిగిలి ఉంది'' అన్నారు.
''నా కోసం నేను సినిమాలు తీసుకోకూడదు. ప్రేక్షకుల అభిరుచే ప్రధానం. అప్పుడే విజయాలు అందుతాయి'' అంటున్నారు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి. 'యజ్ఞం'లో ఫ్యాక్షనిజాన్ని సరికొత్త కోణంలో చూపించిన ఆయన తర్వాత 'వీరభద్ర', 'ఆటాడిస్తా', 'ఏం పిల్లో ఏం పిల్లడో' సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు సాయిధరమ్ తేజ్‌తో ఓ సినిమా రూపొందిస్తున్నారు అన్నారు.ఈనాటి సినీ పోకడల గురించి చెబుతూ... ''ట్రెండ్‌ని అర్థం చేసుకొని మారాలి. కథ ఎలాంటిదైనా యువతరానికి నచ్చేలా చెప్పాలి. కుటుంబ ప్రేక్షకులూ ముఖ్యమే. వాళ్లంతా టీవీలకు అతుక్కుపోతున్నారు. ఎలాంటి హింస, అశ్లీలత లేకపోతే తప్పకుండా వారూ.. థియేటర్ల వరకూ వస్తారు. ఇకనుంచి విరామం లేకుండా సినిమాలు తీస్తా. నితిన్ హీరోగా ఓ సినిమా ఉంటుంది. అది వచ్చే యేడాది ఫిబ్రవరిలో మొదలవుతుంది''అన్నారు.


Click it and Unblock the Notifications












