హీరో, దర్శకుడు కాంబినేషన్ నమ్ముకోవద్దు..దిల్ రాజు
సినిమాలు హిట్టవ్వాలంటే స్క్రిప్టునే నమ్ముకోవాలి అంటున్నారు ప్రముఖ నిర్మాత మరియు పంపిణీ దారుడైన దిల్ రాజు. తెలుగు చిత్ర పరిశ్రమ 2010 లో విడుదలైన 153 చిత్రాల్లో ఐదే హిట్టయ్యాయి. ఇంత భారీ ఫెయిల్యూర్ కి కారణం విశ్లేషిస్తూ ఆయన... స్క్రిప్టునే నమ్ముకుని కొందరు సినిమాల తీస్తూంటే కొందరు హీరో, దర్శకుడు కాంబినేషన్ నమ్ముకుని సినిమాలు తీస్తున్నారు. మొదటిరకం ఎప్పుడూ సేఫే. రెండో రకం అప్పుడప్పుడూ మిరాకిల్ గా పెద్ద అయితే కావచ్చు.
కానీ అదే ప్రామాణికం కాదు. డైరక్టరన్ ని, హీరోని నమ్ముకున్నా ప్రతీ విషయంలోనూ నిర్మాత చెక్ అసరం. అది ఎక్కువ లోపించడం వల్లనే ఈ యేడాది చిత్రాల్లో ఎక్కువ భాగం ప్లాప్ అయ్యాయి. విజయం పొందిన సినిమాల్లో కూడా నిర్ాత ప్లస్ పంపిణీదారుడు హ్యాపీగా ఉండగలిగింది మళ్ళీ రెండు సినిమాలు మాత్రమే.
ఈ కారణంగానే ఇప్పుడు చిత్రపరిశ్రమ స్ధంభించింది. త్వరలో మంచి పరిణామాల వైపు దారి తీస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. ఇక ఈ సంవత్సరం దిల్ రాజు...మరో చరిత్ర ని వరుణ్ సందేశ్ తో రీమేక్ చేసారు. ఆ తర్వాత రామ్, అర్జున్ కాంబినేషన్ లో రామ రామ కృష్ణ కృష్ణ చిత్రం విడుదల చేసారు. ఆ తర్వాత ఎన్టీఆర్,కాజల్, సమంత కాంబినేషన్ లో బృందావనం చిత్రం రిలీజ్ చేసారు.
ఇక నాగార్జున హీరోగా రాధామోహన్ దర్శకత్వంలో గగనం చిత్రం నిర్మించారు. అది త్వరలో విడుదల కానుంది. మరో ప్రక్క దశరధ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రం రూపొందుతోంది. ఇక దిల్ రాజు ఆయన చెప్పిన మాటలైన స్క్రిప్టునే నమ్ముకోవాలి, డైరక్టర్స్, హీరోల కాంబినేషన్ ని కాదు అనేది ఎంత వరకూ ఆచరిస్తున్నారో, ఆచరిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











