చిరు 150వ సినిమా స్క్రిప్టుపై చరణ్ ప్రకటన
చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు వస్తుందో? అసలు వస్తుందో? రాదో అని ఆయోమయంలో ఉన్న అభిమానుల్లో సందేహాలను తొలగించడానికి చిరు తనయుడు రామ్ చరణ్ తేజ అవకాశం వచ్చినప్పుడల్లా ప్రయత్నిస్తున్నారు. తాజాగా సోమవారం ఈ విషయమై రామ్ చరణ్ తేజ మరోసారి ప్రకటన చేశారు. నాన్న 150వ సినిమాకు సంబంధించిన స్క్రిప్టును పరిశీలిస్తున్నామని, అది ఖరారైన వెంటనే అధికారిక ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు. ఇండియన్ నేవీ పోలో జట్టుతో జరిగి మ్యాచ్ లో రామ్ చరణ్ జట్టు తలపడిన సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు చరణ్ పై విధంగా స్పందించారు.
రామ్ చరణ్ తేజ యజమానిగా ఉన్న ఆర్ సి పోలో జట్టు, ఇండియన్ నేవీ ఫోలో జట్టుఛీఫ్ మినిస్టర్ కప్ కోసం సోమవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో రామ్ చరణ్ టీం విజయం సాధించింది. ఇటీవల జరిగిన ప్రిన్స్ ఆఫ్ బేరర్ కప్ ను కూడా రామ్ చరణ్ పోలో జట్టు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











