చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్.. ఒకే కథ మూడు కోణాల్లో, ఊహకు అందని విధంగా రాజమౌళి ప్లాన్!
Recommended Video

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోయే మల్టి స్టారర్ చిత్రానికి రంగం సిద్ధం అవుతోంది. దర్శక ధీరుడు రాజమౌళి ఈ క్రేజీ ప్రాజెక్టు ప్రీప్రోడుక్షన్ పనులు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథని తీర్చిదిద్దే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ చిత్ర కథ పూర్తయిపోయింది ఇటీవల వర్గాలు వచ్చాయి. ఆ వార్తల్లో ఏలాంటి వాస్తవం లేదని రాజమౌళి సన్నిహితులు చెబుతున్నారు.

అన్నీ పక్కాగా జరిగాకే
ఎన్టీఆర్, రాంచరణ్ తొలిసారి కలసి నటిస్తుండడం, అది కూడా రాజమౌళి దర్శకత్వంలో కాబట్టి అంచనాలు తారాస్థాయికి చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో అన్ని పక్కాగా ఉండేలా రాజమౌళి భావిస్తున్నారు. స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పక్కాగా కుదిరాకే సెట్స్ పైకి వెళ్లాలని భావిస్తున్నారు.

మూడు కోణాల్లో కథ
విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్ర కథని మూడు కోణాల్లో రాశారట. ఈ మూడింటిలో దీనిని ఫైనల్ చేస్తే బావుంటుంది అనే విషయంలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అసలు ఆడియన్స్ ఊహకు ఏమాత్రం అందని విధంగా ఈ కథ ఉండాలని జక్కన్న భావిస్తున్నాడు.

మగధీర, బాహుబలి లాంటి కథ కాదు
పునర్జన్మల నేపథ్యంలో లేక యుద్దాలులతో కూడుకున్న కథతోనో రాజమౌళి రావడం లేదని అంటున్నారు. అలాంటి తరహా కథలతో మగధీర, బాహుబలి చిత్రాలని తెరకెక్కించిన నేపథ్యంలో ఎన్టీఆర్, చరణ్ చిత్రం భిన్నంగా ఉండాలని రాజమౌళి భావిస్తున్నాడు.

బిజీగా చరణ్, ఎన్టీఆర్
రాంచరణ్, ఎన్టీఆర్ ప్రస్తుతం వారి చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత, బోయపాటి దర్శకత్వంలోని రాంచరణ్ సినిమా దసరా నాటికి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెంటనే రాజమౌళి చిత్రం ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











