రాజమౌళి అడిగినా ఇవ్వలేదు : నాగార్జున
రాజన్న సినిమా డిసెంబర్ 22న విడుదల అవుతున్న సందర్భంగా హీరో నాగార్జున ఓ టీవీఛానల్ ఇంటర్య్వూ లో మాట్లాడారు. రాజన్న సినిమా స్ర్కిప్టు అద్భుతంగా ఉండబట్టే వెంటనే ఒప్సుసుకోవడంతో పాటు నేనే ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. విజయేంద్రవర్మ గారు ఈ కథను చాలా రోజులు కష్టపడి తయారు చేసుకున్నారు. రాజమౌళి తనకు ఈ కథను ఇవ్వమని విజయేంద్రవర్మను ఎన్నోసార్లు అడిగినా ఆయన ఇవ్వలేదట. ఆయన ఆ సినిమాను ఒక ఛాలెంజ్ గా తీయాలని నిర్ణయించుకోబట్టే తన కొడుకు రాజమౌళి అడిగినా ఇవ్వ లేదు. చివరకు రాజమౌళిని సినిమాలో బాగస్వామిని చేశారు అని చెప్పారు.
'రాజమౌళితో నేను తొలిసారి ఈ సినిమాలో పని చేశాను. ఆయన వర్కింగ్ స్టయిల్ అద్భుతంగా ఉంది. సీన్లను ముందే రిహార్సిల్ చేసుకుని వస్తారు. కాబట్టి షూటింగ్ మొదలయ్యాక కెమెరా అక్కడ పెట్టాలా? ఇక్కడ పెట్టాలా? అనే ఆలోచన లేకుండా ఫర్ ఫెక్ట్ గా చేస్తారు. ఆయనతో పని చేస్తే అస్సలు జాప్యం అనేదే ఉండదు అని చెప్పారు. యాదార్థ ఘటలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రం రూపొందింది, సినిమా అద్భుతంగా వచ్చిందని' అని నాగార్జున చెప్పారు.
సినిమాలో దాదాపు ఎక్కువ మందిని కొత్త వారినే తీసుకున్నాం. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి లాంటి వారిని మనం ఇప్పటికే పలు పాత్రల్లో చూశాం కాబట్టి వారు సెట్ కారనే ఉద్దేశ్యంతోనే ఇలా చేశాం అన్నారు.


Click it and Unblock the Notifications











