ప్రభాస్, మహేష్ అడిగినా కూడా వాళ్ళతో సినిమా చేయను.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు చిన్న సినిమాలతోనే బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాలను అందుకున్న నిర్మాతల్లో MS రాజు ఒకరు. ప్రస్తుతం దిల్ రాజు ఎలాగైతే సినిమాలను తనదైన శైలిలో తెరపైకి తీసుకొస్తున్నారో అప్పట్లో ఎమ్మెస్ రాజు కూడా దర్శకులతో ప్రత్యేకంగా మాట్లాడి సినిమాలను వెండితెరపైకి తీసుకువచ్చేవారు. ఆయన ప్రమేయం లేకుండా ఏ సినిమా కూడా వెండితెరపై కి వచ్చేది కాదు. అలా ఒక ప్రాజెక్టు విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకునేవారు.
ఆయన ప్రొడక్షన్ లో వచ్చిన దేవి, వర్షం, ఒక్కడు, మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. ఇలా ఎన్నో సినిమాలు వరుసగా బాక్సాఫీసు వద్ద మంచి విజయాలను అందుకున్నాయి అయితే MS రాజు కొంత కాలం అనంతరం ఇతర దర్శకులతో సినిమాలు చేయకుండా సొంతంగా డైరెక్షన్ చేస్తూ ఓ వర్గం వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 7 డేస్ 6 నైట్స్ అనే మూవీ కోసం మరోసారి దర్శకుడిగా మారిన ఆయన సినిమా ప్రమోషన్లో బిజీ అయ్యారు.

సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం జూన్ 24 విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో MS రాజు స్టార్ హీరోలతో సినిమాలు చేయకపోవడానికి గల కారణాన్ని చెప్పారు. ప్రస్తుతం అగ్ర హీరోలుగా ఉన్న మహేష్ బాబు ప్రభాస్ ఇద్దరి కెరీర్ కు మొదట బూస్ట్ ఇచ్చే విధంగా అప్పట్లో భారీగానే సినిమాలని నిర్మించారు. వర్షం, ఒక్కడు సినిమాలు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేశాయి.
అయితే ఆ హీరోలు ఇప్పుడు ఎమ్.ఎస్.రాజు పై కృతజ్ఞతతో సినిమా చేయకుండా ఉంటారా అనే విషయం అందరిలో హాట్ టాపిక్ మారింది. ఇక అదే విషయంపై స్పందించిన ఈ నిర్మాత.. తాను స్టార్ హీరోలు, దర్శకుల వెంట వెళ్లనని స్పష్టం చేశారు. ఒకవేళ మహేష్ బాబు, ప్రభాస్ లు ఇద్దరు కూడా పెద్ద సినిమాలు చేయమని అడిగితే తాను సినిమా చేయనని, ఎందుకంటే తనకు నచ్చినట్లు సినిమాలు తీయడం ఇష్టం అని కామెంట్ చేశారు. ఎమ్. రాజు అలా కామెంట్స్ చేయడంతో ఓ వర్గం ఆడియెన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.


Click it and Unblock the Notifications











