Sebastian P.C. 524 OTT: విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి.. ఎందులో రాబోతుందంటే!

బ్యాగ్రౌండ్ లేకపోయినా కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చాలా మంది కుర్రాళ్లు హీరోలుగా వస్తున్నారు. అయితే, అందులో అందరూ సక్సెస్ కావడం లేదు. కొందరు మాత్రమే మొదటి చిత్రంతోనే గుర్తింపును అందుకోవడంతో పాటు సక్సెస్‌లనూ ఖాతాలో వేసుకుంటున్నారు.

అలాంటి వారిలో కిరణ్ అబ్బవరం ఒకడు. 'రాజావారు రాణిగారు' అనే సినిమాతో పరిచయమైన అతడు.. మంచి గుర్తింపును అందుకుని.. గత ఏడాది 'ఎస్ఆర్ కల్యాణమండపం' అనే సినిమాతో భారీ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే గత వారం 'సెబాస్టియన్ పీసీ 524' అనే సినిమతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక, ఈ సినిమా రెండు వారాలకు ఓటీటీలోకి రాబోతుంది. ఆ సంగతులు మీకోసం!

సెబాస్టియన్ పీసీగా వచ్చేశాడుగా

సెబాస్టియన్ పీసీగా వచ్చేశాడుగా

‘ఎస్ఆర్ కల్యాణమండపం' హిట్‌తో జోష్‌లో ఉన్న కిరణ్ అబ్బవరం.. బాలాజీ సయ్యపురెడ్డి తెరకెక్కించిన చిత్రమే ‘సెబాస్టియన్ పీసీ 524'. నువేక్ష, కోమలి ప్రసాద్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను జోవితా సినిమాస్ బ్యానర్‌పై సిద్దా రెడ్డి, రాజు, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు. జిబ్రాన్ దీనికి సంగీతం అందించిన ఈ మూవీ మార్చి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అంచనాలను పెంచిన అప్‌డేట్స్

అంచనాలను పెంచిన అప్‌డేట్స్

మర్డర్ మిస్టరీగా రూపొందిన ‘సెబాస్టియన్ పీసీ 524' మూవీపై ఆరంభంలో అంచనాలు పెద్దగా లేవు. కానీ, ఈ చిత్రం నుంచి ఏది విడుదలైన మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు భారీగా వ్యూస్ వచ్చాయి. అలాగే, పాటలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో కిరణ్ నటించిన ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి.

బిజినెస్‌కు తగ్గట్లుగానే విడుదల

బిజినెస్‌కు తగ్గట్లుగానే విడుదల

తెలుగు రాష్ట్రాల్లో కిరణ్ అబ్బవరంకు పెద్దగా మార్కెట్ లేదు. కానీ, ‘ఎస్‌ఆర్ కల్యాణమండపం' మూవీ హిట్ అవడంతో ‘సెబాస్టియన్ పీసీ 524'కి కూడా డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ సినిమా హక్కులు డీసెంట్ రేట్లకు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేసేశారు.

మిక్స్‌డ్ టాక్.. కలెక్షన్లు రాలేదు

మిక్స్‌డ్ టాక్.. కలెక్షన్లు రాలేదు

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘సెబాస్టియన్ పీసీ 524' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. కానీ, ఆరంభంలోనే ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ ప్రభావం సినిమాపై భారీ స్థాయిలో చూపించింది. ఫలితంగా దీనికి కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు. దీంతో వారం రోజుల్లోనే చాలా థియేటర్లలో ఈ సినిమా రన్‌ను ఆపేశారు.

ఆ ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్

ఆ ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్

ఎన్నో అంచనాలతో వచ్చిన ‘సెబాస్టియన్ పీసీ 524' మూవీ ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకోవడంలో విఫలమైంది. దీంతో చాలా తక్కువ రోజులు మాత్రమే థియేటర్లతో సందడి చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి చాలా రకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్‌పై ఆహా అధికారిక ప్రకటనను వదిలింది.

Recommended Video

Kiran Abbavaram Terrific Speech | Sebastian PC524 Trailer Launch | Filmibeat Telugu
 ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించేసి

ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించేసి

తెలుగు భాషకు చెందిన ప్రముఖ ఓటీటీ దిగ్గజం ఆహా సంస్థ ‘సెబాస్టియన్ పీసీ 524' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను మంచి ధరకు కొనుగోలు చేసింది. ఇక, థియేటర్లలో రన్ ఆగిపోవడంతో ఈ సినిమాను విడుదలైన రెండు వారాలకే అంటే మార్చి 18 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసిన సదరు సంస్థ.. డేట్‌ను ప్రకటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X