బి.వియస్ రవి 'సెకండ్ హ్యాండ్' రిలీజ్ డేట్ ఖరారు
హైదరాబాద్ : రచయిత,దర్శకుడు బి.వియస్ రవి నిర్మాతగా మారి ఓ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం టైటిల్ పేరు 'సెకండ్‌హ్యాండ్'. తన స్నేహితుడు పూర్ణ తో కలిసి ఈ చిత్రం నిర్మిస్తున్నారు. మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ సమర్పిస్తోంది. శ్రేయాస్ చిత్ర పతాకంపై తెరకెక్కుతోంది. సినిమాను ఈ నెల 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఓ రొమాంటిక్ సెటైర్ అని చెప్తున్నారు. ఇద్దురు అబ్బాయిలు,ఒక అమ్మాయి మధ్య జరిగే కథ అని చెప్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'సెకండ్ హ్యాండ్'. యస్.పూర్ణానాయుడు నిర్మాత. బి.వి.యస్.రవి సహ నిర్మాత. ధన్య బాలకృష్ణ హీరోయిన్. సుధీర్‌వర్మ, శ్రీ విష్ణు, కిరీటి, అనూజ్ లీడ్ రోల్స్‌లో నటించారు. పోసాని కృష్ణమురళి కీలక పాత్రధారి.

లో బడ్జెట్ లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి అశోశియేట్ గా పనిచేసిన రవి చంద్ర అందిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ భూత్ రిటర్న్స్, అబ్ తక్ చప్పన్ 2 చిత్రాల కెమెరామెన్ అవనీంద్ర ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. పూరి చిత్రాలకు ఎడిటర్ గా చేసే ఎస్.ఆర్ శేఖర్ ఈ చిత్రానికి ఎడిటర్ గా చేస్తున్నారు. కొత్త తరహా కాన్సెప్టు తో రూపొందే ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాకు కెమెరా: అవనీంద్ర, ఉమాశంకర్, సంగీతం: రవి చంద్ర, ఎడిటింగ్: యస్.ఆర్.శేఖర్.


Click it and Unblock the Notifications











