జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాగే నాగచైతన్యకూ జరిగింది!
అందరూ దగ్గుబాటి రాణాలా అదృష్టవంతులు ఉండరు. రాణా పరిచయమైన మొదటి చిత్రం 'లీడర్" విజయదుందుభి మ్రోగిస్తూ అతనికి శుభారంభానివ్వడం తెలిసిందే. అయితే ఈ అదృష్టం ఎన్టీఆర్ కు కానీ, రామ్ చరణ్ తేజ్ కు కానీ, నాగచైతన్య కు కాని దక్కలేదు. ఈ ముగ్గురు వారసుల తొలిచిత్రాలు వారికి పూర్తి స్థాయిలో సంతృప్తినివ్వలేకపోయాయి. ఎన్టీఆర్ తొలిచిత్రం 'నిన్ను చూడాలని", రామ్ చరణ్ తేజ్ పరిచయమైన మొదటి చిత్రం 'చిరుత"లతో పాటు..నాగచైతన్య మొదటి చిత్రం 'జోష్" ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి.
ఎన్టీఆర్ ద్వితీయ చిత్రం 'స్టూడెంట్ నెం.1" అద్వితీయ విజయం సాధించి అతనికి స్టార్‌డమ్ సంపాదించిపెట్టింది. అదేవిధంగా రామ్‌చరణ్‌తేజ్ రెండో చిత్రం 'మగధీర" కూడా చిరుతనయునికి అసాధారణ విజయం అందించిపెట్టి 'మెగా పవర్‌స్టార్" అనే బిరుదుకు సార్ధకత చేకూర్చి పెట్టింది. ఇప్పుడు తాజాగా ఈ సెకండ్ సెంటిమెంట్ నాగచైతన్యకు వర్తిస్తోంది. నాగచైతన్య మలిచిత్రం 'ఏ మాయ చేసావె" తొలిచిత్రం 'జోష్" మిగిల్చిన అసంతృప్తిని పూర్తిగా పారద్రోలుతోంది!


Click it and Unblock the Notifications











