విషాదం: గోవా బీచ్‌లో శవమై తేలిన హీరో.....ప్రమాదమా? హత్యా?
Recommended Video

మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు, 'సెకండ్ షో' అనే చిత్రంలో నటించిన సిద్దు ఆర్ పిళ్లై(27) గోవా బీచ్‌లో సోమవారం శవమై తేలాడు. సిద్ధు మరణంతో మలయాళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఎంజాయ్ చేసేందుకు గోవా వచ్చి
షూటింగ్ గ్యాప్ దొరకడంతో కాస్త రిలాక్స్ అయ్యేందుకు, ఎంజాయ్ చేసేందుకు సిద్ధు జనవరి 12వ తేదీన గోవా వచ్చాడు. బీచ్‌లో పడి ఉన్న గుర్తు తెలియని మృతదేహం తన కొడుకు సిద్ధుదే అని అతడి తల్లి గుర్తించినట్లు మలయాళ మీడియాలో వార్తలొచ్చాయి.

హత్యా? ప్రమాదమా?
సిద్ధు మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సిద్ధూకు స్విమ్మింగ్ వచ్చని, నీటిలో మునిగి చనిపోయే అవకాశం అయితే లేదని సన్నిహితులు అంటున్నారు. దీంతో పోలీసులు అతడి మరణానికి కారణాలు ఏమిటనే దానిపై ఆధారాలు సేకరిస్తున్నారు.

సెకండ్ షో సినిమా ద్వారా
దుల్కర్ సల్మాన్ తెరంగ్రేట మూవీ ‘సెకండ్ షో' ద్వారానే సిద్ధు కూడా నటుడిగా పరిచయం అయ్యాడు. ఈచిత్రంలో అతడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. 2012లో ఈచిత్రం విడుదలైంది. ఈ సినిమా తర్వాత సిద్ధు పలు చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు.
ట్వీట్ చేసిన దుల్కర్ సల్మాన్
'సెకండ్ షో సినిమా షూటింగ్ లో సిద్ధు చాలా ఉత్సాహంగా ఉండేవాడు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని తెలుపుతున్నా' అంటూ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ ట్వీట్ చేశాడు. పలువురు మలయాళ చిత్ర ప్రముఖులు కూడా సిద్ధ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

త్రిషూర్‌లో అంత్యక్రియలు
సిద్ధు అంత్య క్రియలు సిద్ధు స్వస్థలం అయిన త్రిషూర్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











