చరణ్ తో మళ్ళీ రెండో సినిమాకి రెడీ అవుతన్న దర్శకడు..!?
మెగా స్టార్ తనయుడు రామ్ చరణ్ ని 'చిరుత"గా డిఫరెంట్ గా చూపించి మెగాపవర్ స్టార్ ని చేసిన పూరి జగన్నాథ్ అతనితో రెండో సినిమా చెయ్యబోతున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఆ సినిమాకి సంబంధించిన ఎటువంటి ఎనౌన్స్ మెంట్ జరగలేదు.
కాగా తాజా సమాచారం ప్రకారం ఈ ఇద్దరి కాంబినేషన్ లో త్వరలోనే ఓ భారీ ప్రాజెక్ట్ మొదలౌతుందనే వార్త ఫిల్మిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. 'చిరుత" తర్వాత చరణ్ చేసిన సినిమా 'మగధీర" బ్లాక్ బస్టర్ కావడంతో చరణ్ కి వచ్చిన స్టార్ ఇమేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఆ సినిమా తర్వాత చేసిన 'ఆరెంజ్" డిజాస్టర్ కావడంతో చరణ్ కి హిట్ తప్పనిసరి అయింది.
ప్రస్తుతం తను చేస్తున్న రచ్చ" మీదే ఆశలు పెట్టుకున్నాడు. ఇటీవల స్టార్ట్ అయిన వినాయక్ సినిమా తనకి ఓ డిఫరెంట్ ఇమేజ్ తెస్తుందని భావిస్తున్నాడు. ఇప్పుడు పూరి కాంబినేషన్ లో రెండో సినిమా కూడా ప్లానింగ్ లో వుండడంతో చరణ్ కెరీర్ ఒక గాడిలో పడినట్టు కనిపిస్తోంది. చరణ్ కి ప్రస్తుతం వున్న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని పూరి సబ్జెక్ట్ ని ప్రిపేర్ చేస్తున్నట్టు తెలిసింది. ఈసారి చరణ్ తో చేసే సినిమా పక్కాగా పూరి స్టైల్ లో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో వుంటుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రానప్పటికి స్టోరీ డిస్కషన్స్ మాత్రం రెగ్యులర్ గా జరుగుతన్నాయని సమాచారం. అన్ని ఓకే అవ్వగానే ఈ చిత్రం 2012 ద్వియార్థంలో మొదలవుతుందని సమాచారం. ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ లో బండ్ల గణేష్ బాబు నిర్మించనున్నారు.


Click it and Unblock the Notifications











