విజయ్ దేవరకొండతో రెండోసారి నటిస్తోన్న హీరోయిన్, త్వరలో షూటింగ్ ప్రారంభం!
విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా కొత్త దర్శకుడు భరత్ కమ్మతో చెయ్యబోతున్నాడు. పెళ్ళిచూపులు నిర్మాత యష్ రంగినేని ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉంది. వచ్చే నెల నుంచి సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో రష్మిక మందన నటించబోతోంది.
Recommended Video

విజయ్ దేవరకొండ, దర్శకుడు పరుశురాం ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో కూడా రస్మిక మడోనా హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలి ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. రెండోసారి విజయ్, రష్మిక కలిసి నటిస్తుండడం విశేషం.

విజయ్ దేవరకొండ నటించిన తాజా సినిమా టాక్సీవాలా విడుదలకు సిద్ధంగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించబోతున్న నోటా సినిమా షూటింగ్ చెన్నై లో జరుగుతోంది. హీరో లేకుండా ఉన్న సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. త్వరలో విజయ్ దేవరకొండ షూట్ లో జాయిన్ కాబోతున్నాడు.


Click it and Unblock the Notifications











