ఆ పుస్తకం చదివాకే రెచ్చపోతున్న హీరోయిన్
హీరోయిన్ అమలపాల్ బెజవాడ సినిమా ద్వారా తెలుగు సినిమాల్లోకి ప్రవేశించినా...అంతకు ముందు రెండు డబ్బింగ్ చిత్రాలతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. తన నటనతో దాదాపు మంచి మార్కులే కొట్టేసింది ఈ భామ. అమల ప్రేక్షకుల మెప్పు పొందే రేంజ్ లో రెచ్చిపోవడానికి కారణం 'ది యాక్టర్స్ సర్వైవల్ హ్యాండ్ ' అనే పుస్తకమేనట. హీరోయిన్ అయిన తర్వాత ఈ పుస్తకం చదవే నటన గురించి చాలా మెలకువలు నేర్చుకుందట. ప్రతి ఆర్టిస్టుకి ఆ పుస్తకం ఎంతో ఉపయోగ పడుతుందని, అందులో ఉన్న టిప్స్ తెలుసుకోవడం వల్లనే తన పాత్రలకు న్యాయం చేస్తున్నానని అంటోంది.
అమలపాల్ కు ప్రస్తుతం తెలుగులో ఎలాంటి అవకాశాలు లేవు. ఇటీవల ఆమె నటించిన బెజవాడ చిత్రం డిజాస్టర్ కావడమే అందుకు కారణం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో వెంకీ సరసన అమల నటిస్తున్నట్లు వార్తలు వస్తున్న ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. సిద్ధార్థ సరసన లవ్ ఫెయిల్యూర్ సినిమాలో చేస్తున్నా అది స్ట్రెయిట్ తెలుగు సినిమా కాదు. అయితే తమిళంలో మాత్రం అమ్ముడు నాలుగు సినిమాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











