»   » మాస్టర్ మైండ్ అల్లు అరవింద్-స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటమీద నిలబడుతారా!?

మాస్టర్ మైండ్ అల్లు అరవింద్-స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటమీద నిలబడుతారా!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ హీరోగా, గుణశేఖర్ దర్శకునిగా నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం 'వరుడు". ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించారు. రామానాయుడు స్టూడియోలో ఈ చిత్ర ఆడియోను వినూత్నంగా విడుదల చేశారు. ఆడియోతోనే చిత్ర ప్రచారాన్ని చేశాడు..కథానాయకుడు. అయితే తన నిజజీవితంలో పెళ్లి విషయాన్ని ప్రస్తావించి చిత్రానికి ప్రచారం చేసుకుంటున్నాడు..అల్లు అర్జున్ నిజంగా స్టేజి పై అంత చేస్తుంటే చూసేవారు చాలా ఇబ్బంది కరంగా ఫీలయ్యారు. అల్లు అరవింద్ ప్రస్తావించేప్పుడు..అతని ముఖంలో 'మగధీర" చిత్రాన్ని తన కొడుకు మిస్ అయ్యాడనేది స్సష్టంగా కనిపించింది అంటున్నారు విమర్శకులు.

ఏదేమైనా కానివ్వండి వారి నోటి వెంట సంప్రదాయం అనే పదం రావడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది..అంటున్నారు విమర్శకులు. ఎన్నో కోట్లు సంపాదించిన వారు అన్నింటిని మర్చిపోతుంటే అల్లు అర్జున్ కట్టుబాట్లకు విలువిచ్చే అమ్మాయిని చేసుకుంటానని చెప్పడం నిజంగా అందరూ ఆనందంగా ఫీలయ్యారని సమాచారం. అలాగే అల్లు అర్జున్ ఏది అడిగితే అది తీసుకు వచ్చి ఇచ్చే అరవింద్ కూడా అందుకు ఒప్పుకోవడం చూస్తుంటే మాస్టర్ మైండ్ లో ఏదో ఉండే ఉంటుంది..అనుకుంటున్నారు విమర్శకులు..మరి ఈ వివాహం ఎంత వరకు సక్సెస్ అవుతుంది. వీరు మాట మీద నిలబడతారా! అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మారింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu