అంజలి గొడవకి అసలు కారణం ఇదే??

By Srikanya

హైదరాబాద్ : సినీనటి అంజలి అజ్ఞాతం వీడనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌కు బయలుదేరినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో ఆమె గొడవకు అసలు కారణం ఏమిటి అనేది అంతటా చర్చనీయాంసంగా మారింది. ఆమె తన పిన్ని,బాబాయ్ పై ఎందుకు గొడవ పడింది అన్నదానికి కారణాలు ఇలా ఉన్నాయని మీడియా వర్గాల్లో వినపడుతోంది.

తెలుగు సినిమాల్లో నటిస్తే అనతి కాలంలోనే ప్రాచుర్యం, అధిక పారితోషికం లభిస్తుందని గుర్తించిన అంజలి తన పిన్ని, బాబాయ్‌లతో ఈ విషయమై కొంత కాలం క్రితం చర్చించారు. సీతమ్మ వాకిట్లో హిట్ అవటం..మరిన్ని క్రేజీ ఆఫర్స్ రావటం దానికి ఊతమిచ్చినట్లైంది. అయితే తమిళ సినిమాల్లో నటిస్తేనే భవిష్యత్తు ఉంటుందని పిన్ని,బాబాయ్ చెప్పడంతో వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. అప్పటి నుంచి అంజలి వారితో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోంది.

ఈ క్రమంలోనే డబ్బింగ్‌ సినిమాల నిర్మాతతో మాట్లాడినట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పిన్ని, బాబాయ్‌లు ఆమెను హింసించడం ప్రారంభించారని తెలిసింది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు వెంట వచ్చిన బాబాయ్‌ శనివారం ఆమెపై చేయిచేసుకొన్నట్లు సమాచారం. దీంతో వారితో విడిపోవాలని నిర్ణయించుకున్న అంజలి ఆదివారం తెలుగు పరిశ్రమకు చెందిన ప్రముఖవ్యక్తుల శరణు కోరింది.

ఒక నిర్మాత సహకారంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆమెతో సినిమా ఒప్పందం కుదుర్చుకున్న నిర్మాతలు తమకు ఇబ్బందులు కలగనీయరాదని సినీపెద్దలకు చెప్పుకోవడంతో గురువారం అజ్ఞాతం వీడాల్సిందిగా ఆమెకు సమాచారం పంపినట్టు తెలిసింది. హైదరాబాద్‌కు వచ్చి వివరాలు వెల్లడించాల్సిందిగా ఆమెను సంరక్షిస్తున్న నిర్మాతకు సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అంజలి ఆమె సోదరుడు రవిశంకర్‌తో మరోమారు ఫోన్‌లో మాట్లాడారు. తనతో పాటు మరొకరున్నారంటూ సోదరుడికి చెప్పినట్టు తెలిసింది. ఆమె సోదరుడు వెంటనే జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉన్నతాధికారులకు విషయాన్ని వివరించారు.

తక్షణం హైదరాబాద్‌కు రావాలన్న పోలీసుల సూచనను సోదరుడు అంజలికి చేరవేయటంతో ఆమె అజ్ఞాతం వీడి హైదరాబాద్‌కు బయలు దేరినట్లు తెలిసింది. శుక్రవారం ఉదయం పోలీసుల సమక్షంలో అంజలి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. శాటిలైట్‌ ఫోన్‌ వినియోగిస్తున్నందున అంజలి ప్రస్తుతం ఎక్కడున్నది తెలియటంలేదు. అయితే ఆమె క్షేమ సమాచారాన్ని, రాకను డీసీపీ జి.సుధీర్‌బాబు ధ్రువీకరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X