బాలయ్య న్యూలుక్ వెనుక అసలు సీక్రెట్ ఇదే.. బోయపాటి కోసం కాదట..
నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్త గెటప్ విపరీతమైన చర్చకు దారి తీసింది. ఎవరూ ఊహించని విధంగా తెల్లటి గడ్డం, గుండుతో దర్శనమిచ్చే సరికి అభిమానులు షాక్ గురయ్యారు. బాలయ్య ఏంటి ఇలా మారిపోయాడనే చర్చ మొదలైంది. బాలయ్య కొత్త సినిమా గెటప్ అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే బాలయ్య న్యూ లుక్ వెనుక అసలు కారణం ఇదేనని సన్నిహితులు వెల్లడించారు. బాలయ్య గెటప్ వెనుక అసలు రీజన్ ఇదే...
Recommended Video

విగ్స్‌తో బాలయ్యకు కష్టాలు
బట్టతల కారణంగా బాలయ్య సినిమాల్లో రకరకాల విగ్స్ ఉపయోగించడం చూసిందే. చాలాసార్లు పలు రకాల విగ్స్‌తో విభిన్నమైన గెటప్స్‌తో నటించి ఆలరించారు. అయితే బట్టతల నివారణ కోసం ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకోవాలని సన్నిహితులు చెబితే.. ధైర్యం చేయలేకపోయారనే అప్పట్లో చెప్పకొన్నారు. విగ్స్ వల్ల కలిగే చికాకుకు చెక్ చెప్పేందుకు తాజాగా మనసు మార్చుకొన్నారని తెలిసింది.

స్నేహితుల సలహా మేరకు
ఇక ముందు విగ్స్ ధరించకుండానే ఉండటానికి బాలయ్య ధైర్యం చేశారని, సన్నిహితుల సలహా మేరకు కొద్ది రోజుల క్రితం బాలయ్య ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకోవడం జరిగింది. అందుకే కొత్త గెటప్‌లో దర్శనమిస్తున్నారు. ఇది సినిమా కోసం రెడీ అవుతున్న గెటప్ కాదు అని సన్నిహితులు పలు ప్రశ్నలకు జవాబు ఇచ్చారు.

సల్మాన్ ఖాన్ మాదిరిగానే
గతంలో సల్మాన్ ఖాన్ కూడా ఇలాంటి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకొన్నారని, అదే పద్దతిని అనుసరించి బాలయ్య కూడా చేయించుకొన్నట్టు సమాచారం. అత్యాధునిక సాంకేతికతతో జరిగిన ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో బాలయ్య కొత్తరూపంలో కనిపించబోతున్నారు. త్వరలోనే న్యూలుక్ మరింత మారిపోతుందని చెప్పుకొచ్చారు.

బోయపాటి శ్రీనుతో
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. అయితే కరోనావైరస్ కారణంగా సినీ పరిశ్రమ లాక్‌డౌన్ ప్రకటించడంతో షూటింగ్ వాయిదా వేశారు. లాక్‌డౌన్ అనంతరం ఈ సినిమా షూట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











