ఇలియానా... సెక్సీ పార్ట్ వెనక సీక్రెట్
ఇలియానాకి అతి పెద్ద ఎస్సెట్ ఏంటి అంటే తడుముకోకుండా ఆమె నడుము అని అభిమానలు చెప్పేస్తారు. అలాగే ఆ విషయాన్ని ఇలియానా కూడా కన్ఫర్మ్ చేస్తూ...నాలో సెక్సీయిస్ట్ పార్ట్ అదే డిక్లేర్ చేస్తోంది. అయితే ఆ సెక్సీ పార్ట్ వెనక సీక్రెట్ ఏమిటీ అంటే ఆమె ఓ చిన్ కథ చెప్తోంది. నేను స్కూల్ కెళ్ళే సమయంలో చాలా లావుగా ఉండేదాన్ని. అందరూ నన్ను చాలా కామెంట్ చేసేవారు. దాంతో నేను నా శరీరంపై శ్రధ్దపెట్టి వర్కవుట్స్ చేయటం ప్రారభించాను. అలా సన్నపడుతూంటే అందరూ నా స్లిమ్ ని గమనించకుండా నా నడుము అందంగా ఉందని పొగిడేవారు. దాంతో నేను ఆ ఏరియాపైనే మరింత శ్రధ్ద పెట్టడం ప్రారంభించాను. ఇప్పుడు అదే నా యుఎస్ పిగా మారింది. సినిపరిశ్రమలో నిలబడేటట్లు చేస్తోంది అంటూ వివరించిందామె. అలాగే మన బలహీనతలు, బలాలు తెలిసున్నప్పుడే కదా మనం గెలిచేది అంటూ నవ్వుతోంది. ప్రసుత్తం ఇలియానా...ఎన్టీఆర్ సరసన శక్తిలో చేస్తోంది. అలాగే ధన అనే తమిళ చిత్రంలోనూ, రుద్ర తాండవం అనే మళయాళ చిత్రంలోనూ ఆమె హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











