»   » పవన్‌ కళ్యాణ్‌పై రూమర్ల...వెనక అసలు రహస్యం!

పవన్‌ కళ్యాణ్‌పై రూమర్ల...వెనక అసలు రహస్యం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ వపన్ కళ్యాణ్. ఆయన పేరులోనే పవర్ ఉంది. ఆయన సపోర్టు ఉంటే సినీ పరిశ్రమలో ఏదైనా సాధ్యమే. ఇండస్ట్రీలో రికార్డులు బద్దలు కావాలన్నా, సినిమా బంపర్ హిట్ కావాలన్నా ఆయనే. పవన్ ఏదైనా ఆడియో ఫంక్షన్‌కు హాజరైతే చాలు సినిమాపై ఎక్కడలేని అంచనాలు. ఆయన ఏదైనా సినిమాను రికమండ్ చేస్తే చాలు.....సినిమాకు భారీ ఓపెనింగ్స్.

పరిశ్రమలో పరిస్థితి ఎలా తయారైందంటే....పవన్ కళ్యాణ్‌‌కు ఉన్న ఇమేజ్‌ను తమ పబ్లిసిటీకి ఒక ఆయుధంగా వాడుకునే వారు ఫిల్మ్ నగర్లో చాలా మంది తయారయ్యారు. ఆయన పేరు చెప్పుకుని సినిమాలను హిట్ చేసుకున్నావారూ, ఆయన ఫోటోలను వాడుకుని వ్యాపారం పెంచుకున్న వారూ ఉన్నారు.

అయితే ఆయనకు ఉన్న ఈ భారీ పాపులారిటీ ప్రత్యర్థులకు ఆయుధంగా మారాయి. తాజాగా పవన్ కళ్యాణ్ టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ వచ్చినపుకార్లు.....మెగా ఫ్యామిలీ ప్రత్యర్థి వర్గం చేసిన పనే అని చాలా మంది అభిమానుల అభిప్రాయం. మెగా ఫ్యామిలీ, చిరంజీవి ప్రతిష్టను మసకబార్చడానికే ఇదంతా అని ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. 'అత్తారింటికి దారేది' చిత్రం పైరసీ వెనక కూడా ఆయనంటే గిట్టని వాళ్ల హస్తం ఉందనే వాదన ఉంది.

ఏది ఏమైతేనేం....పవర్ స్టార్ టీడీపీలో చేరుతున్నారనే రూమర్లకు ఈ రోజు నాగబాబు తెర దించారు. తాను, తన సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టిడిపిలో చేరుతున్నారనే వార్తలను ఆయన తోసిపుచ్చారు. మీడియా కథనాలను తాను ఖండిస్తున్నట్లు చెప్పారు. టిడిపిలో చేరుతున్నట్లుగా వచ్చిన వార్తలను కొట్టి పారేసిన నాగబాబు తాము రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నామన్నది కూడా అవాస్తవమన్నారు. ప్రస్తుతం తాము తమ వృత్తిలో బిజీగా ఉన్నామని చెప్పారు. టిడిపిలో చేరుతున్నారనే ప్రచారంతో పాటు కొత్త పార్టీ వార్తలు మీడియాలో వస్తున్నాయని, అదంతా అవాస్తవమే అన్నారు. మీడియా కథనాలతో ప్రజలు, అభిమానుల్లో గందరగోళం ఏర్పడిందన్నారు. తమను సంప్రదించకుండా, తమ వివరణ కోరకుండా ప్రసారం చేయడం సరికాదన్నారు.

English summary
It is said that rumors were spread on Pawan Kalyan to make trouble Chiranjeevi. Film stars Pawan Kalyan and Nagababu have denied reports which suggested that they are planning to join politics and have decided to support Telugu Desam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu