»   » ఎందుకింత ప్రచారం..!? బాలయ్య సినిమా విజువల్స్ అన్నీ కాపీ అంట

ఎందుకింత ప్రచారం..!? బాలయ్య సినిమా విజువల్స్ అన్నీ కాపీ అంట

Posted By:
Subscribe to Filmibeat Telugu

  నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అతి తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసుకుంది. చారిత్రక కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. భారీ యుద్ధ సన్నివేశాలతో కలిపి మొత్తం షూటింగ్ ను నాలుగు నెలల లోపే పూర్తి చేశారు.

  ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో.. ఇంత తక్కువ సమయంలో ఇంత గ్రాండ్ విజువల్స్ ఎలా సాధ్యమయ్యాయన్న అనుమానం వ్యక్తమవుతోంది. అంతేకాదు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కోసం బాజీరావ్ మస్తానీ సినిమాలోని విజువల్స్ ను, గ్రాఫిక్స్ ను వాడుకున్నారన్న టాక్ వినిపిస్తోంది.

   కాపీ చేసినవి కాదు:

  కాపీ చేసినవి కాదు:


  బాజీరావ్ మస్తానీ సినిమాలోని విజువల్స్ వాడుకునేందుకు ఆ సినిమా దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ నుంచి క్రిష్ ముందుగానే పర్మిషన్ కూడా తీసుకున్నాడట. గతంలో సంజయ్ నిర్మాతగా తెరకెక్కించిన గబ్బర్ ఈజ్ బ్యాక్ సినిమాతో క్రిష్ బాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ అనుబంధం తోనే గ్రాఫిక్స్ విషయంలో సంజయ్ సాయం చేశాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి యూనిట్ కొట్టి పారేస్తోంది. ట్రైలర్ లో కనిపించిన విజువల్స్ అన్ని ఈ సినిమా కోసం స్పెషల్ గా క్రియేట్ చేసినవే గాని.., కాపీ చేసినవి కాదని తేల్చి చెపుతోంది.

   బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్:

  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్:


  అయితే ఈ తరహా వివాదాలు ఇప్పుడే మొదలైనవేం కాదు పాటల విషయం లోనూ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లోనూ ఇదే తరహా ప్రచారం జరిగింది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి'కి చిరంతన్ భట్ కంపోజ్ చేసిన కొన్ని పాటలు బాలీవుడ్ హిస్టారికల్ మూవీ ‘బాజీరావ్ మస్తానీ' లోని సాంగ్స్ ని నుంచి కాపీ కొట్టారనే రూమర్స్ బయలుదేరాయి.

   కొన్ని ట్యూన్స్ :

  కొన్ని ట్యూన్స్ :


  సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘బాజీరావ్ మస్తానీ'లోని కొన్ని ట్యూన్స్ ని ‘గౌతమీపుత్ర శాతకర్ణి' లో వాడుకున్నట్లు ఉందని కొంతమంది చెబుతున్నారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రంలో బాలకృష్ణ, శ్రీయా ల మధ్య చిత్రీకరించిన రొమాంటిక్ సీన్స్ లో పాటలు.. ‘బాజీరావ్ మస్తానీ'లోని సాంగ్స్ ను పోలి ఉన్నాయన్నది కొందరి వాదన. అయితే ఈ రూమర్స్ ని ‘గౌతమీపుత్ర శాతకర్ణి' మేకర్స్ కొట్టిపడేస్తున్నారు.

   సొంతంగా చేసుకున్న ట్యూన్స్:

  సొంతంగా చేసుకున్న ట్యూన్స్:


  తాము ఏ చిత్రంలోని ట్యూన్స్ ని వాడుకోలేదని అన్ని సొంతంగా చేసుకున్న ట్యూన్స్ అని చెబుతున్నారు. చిరంతన్ భట్ ‘గౌతమీపుత్ర శాతకర్ణి....' కి కంపోజ్ చేసిన సాంగ్స్ పూర్తిగా ఒరిజినల్ అని వాదిస్తున్నారు. ఈవార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ఉత్తారాది సంగీత దర్శకులు మెలొడీకి ప్రాధాన్యత ఇస్తూ సమకూర్చే ట్యూన్స్ ‘శాతకర్ణి' సినిమా పాటలకు ఎంత వరకు క్రేజ్ ను తెచ్చి పెడతాయి అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.

   భాజీరావ్ మస్తానీ:

  భాజీరావ్ మస్తానీ:


  అదేవిధంగా క్రిష్ కూడ ‘శాతకర్ణి' పాటల చిత్రీకరణ విషయంలో బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ‘భాజీరావ్ మస్తానీ' లోని పాటల చిత్రీకరణ విషయంలో అనుసరించిన పద్ధతినే క్రిష్ కూడ అనుసరించాడు అన్న రూమర్స్ కూడ వినిపిస్తున్నాయి.

   నారా చంద్ర‌బాబునాయుడు:

  నారా చంద్ర‌బాబునాయుడు:


  ఈవార్తలు ఇలా ఉండగా డిసెంబర్ 26న తిరుపతిలో జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రు మున్సిప‌ల్ హై స్కూల్‌ ప్రాంగణంలో జరగబోతున్న ‘శాతకర్ణి' ఆడియో ఫంక్షన్ కు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు లతో సహా

   భారీ స్థాయిలో :

  భారీ స్థాయిలో :


  ఎందరో ప్రముఖులు పాల్గొనబోయే ఈ ఆడియో వేడుకకు మన ఇరు రాష్ట్రాల నుంచి బాలయ్య అభిమానులను అధిక సంఖ్యలో రప్పించి నందమూరి సత్తా చూపించే విధంగా ఈ ఈవెంట్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. బాలయ్య సరసన శ్రియ హీరోయిన్ గా నటిస్తున్న., ఈ సినిమాలో బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని కీలక పాత్రలో నటిస్తోంది.

  English summary
  According to the strong buzz from film circles, Krish has used a few shots of the war scenes from Bollywood epic drama Bajirao Mastani. Krish has had a prior agreement with Bajirao’s director and producer Sanjay Leela Bhansali it seems.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more