»   » ఫిల్మ్ స్టార్ల జీవితాల్లోని ఫన్నీ సీక్రెట్స్...(ఫోటోలు ఫీచర్)

ఫిల్మ్ స్టార్ల జీవితాల్లోని ఫన్నీ సీక్రెట్స్...(ఫోటోలు ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రతి వ్యక్తి జీవితంలోనూ బయటి ప్రపంచానికి తెలియని కొన్ని నిజాలు, ఆసక్తికర విషయాలు ఉంటాయి. సినీ తారల జీవితాల్లో కూడా ఇలాంటి ఆసక్తికరమైనవి ఉండటం సహజమే. ఈ వారం మనం పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్ల గురించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

షారుక్ ఖాన్

షారుక్ ఖాన్ తొలి సంపాదన ఎంతో తెలుసా? కేవలం రూ. 50 మాత్రమే. ఢిల్లీలో జరిగిన పంకజ్ ఉదాస్ కచేరికి గేట్ కీపర్‌గా ఉన్నందుకు ఆయనకు ఈ మొత్తం ఇచ్చారట. ఆ డబ్బుతో షారుక్ ట్రైన్ లో ఆగ్రా వెళ్లి తాజ్ మహల్ చూసొచ్చాడట.

ఐశ్వర్యరాయ్ బచన్
ఐశ్వర్యరాయ్ సినిమాల్లో ఫేమస్ కాకముందు ఓ టీవీ సీరియల్‌లో డబ్బింగ్ జాబ్ కోసం వెళ్లిందట. అయితే ఆమెను రిజెక్ట్ చేసారట నిర్వాహకులు. కానీ ఇప్పుడు ఐశ్వర్యరాయ్ పొజిషన్ ఏమిటో కొత్తగా చెప్పక్కర్లేదు.

సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ తన ముక్కు తుచుకోవడానికి ముల్ ముల్ క్లాత్ వాడతారట. మనం చూస్తే అది హ్యాండ్ కర్చీఫా లేక టిష్యూ పపరా? అనే అనుమానం రాక తప్పదు.

శిల్పా శెట్టి
హీరోయిన్ శిల్పాశెట్టికి కారు నడపాలంటే మహా భయం. అందుకే ఆమె ఎక్కడికి వెళ్లినా డ్రైవర్ తీసుకుని వెళుతుందట. అసలు ఆమెకు ఇప్పటి వరకు కారు ఎలా నడపాలో తెలియదట.

అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్ పేరు ఫిల్మ్ ఫేర్ అవార్డులకు ఏడు సార్లు నామినేట్ అయింది. అయితే ఆయనకు రెండు సార్లు మాత్రమే అవార్డు దక్కాయి. గరమ్ మసాలా చిత్రానికి బెస్ట్ యాక్టర్ ఇన్ కామిక్ విభాగంలో, అజ్‌నభీ చిత్రంలో నెగెటివ్ రోల్ చిత్రానికి అవార్డు దక్కింది.

కరీనా కపూర్
కరీనా కపూర్ తల్లి ఆమె గర్భంలో ఉన్నపుడు 'అన్నా కరెనినా' అనే పుస్తకం చదవిందట. ఆ పుస్తకం నుండే ఆమెకు కరీనా అనే పేరును సెలక్ట్ చేసారట. కానీ ఆమె ఫ్యామిలీ, క్లోజ్ ఫ్రెండ్స్ ఆమెను బెబో అని పిలుస్తారు.

హృతిక్ రోషన్
హృతిక్ రోషన్‌కు చిన్నతనంలో సరిగా మాట్లాడటం వచ్చేది కాదట. నత్తి నత్తిగా మాట్లాడేవాడట. ఆ తర్వాత అందకు చికిత్స చేసుకున్నాడట. ఇప్పుడు హృతిక్ బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు.

కత్రినా కైఫ్

కత్రినా కైఫ్


కత్రినా కైఫ్ తన సినిమాల విడుదలకు ముందు సిద్ధి వినాయక టెంపుల్, మౌండ్ మేరీ చర్చ్, అజ్మీర్ షరీఫ్ దర్గాను తప్పకుండా దర్శించి ప్రార్థిస్తుందట.

అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ సినిమాల్లోకి రాకముందు కోల్‌కతాలో షిప్పింగ్ కంపెనీలో పని చేసే వాడు. అప్పుడు సెకండ్ హ్యాండ్ ఫియట్ కారును తొలిసారిగా కొనుగోలు చేసాడట అమితాబ్.

రాణి ముఖర్జీ

రాణి ముఖర్జీ

బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ 14 ఏళ్ల వయసులోనే తన తండ్రి రూపొందించిన బెంగాళీ చిత్రం ‘బియార్ ఫూల్'లో అతిథి పాత్రలో నటించిందట.

రణబీర్ కపూర్

రణబీర్ కపూర్


రణబీర్ కపూర్ ఇప్పటికీ ప్రతి వారం తన తల్లి నుంచి రూ. 1500 పాకెట్ మనీ తీసుకుంటాడట.

ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా

అమెరికాలో స్టేట్ లెవల్‌లో నిర్వహించిన ఓ చారిటీ కార్యక్రమానికి ఎంపికయిన తొలి ఇండియ్ ప్రియాంక చోప్రానేనట.

సైఫ్ అలీఖాన్

సైఫ్ అలీఖాన్


‘ఓంకారా' చిత్రంలో ఓ షాడో సీన్ చిత్రీకరించేటపుడు ఆ చిత్ర దర్శకుడు విశాల భరద్వాజ సైఫ్ అలీ ఖాన్‌ను నువ్వు నగ్నంగా ఉంటే కళాత్మకంగా, బ్యూటిఫుల్ గా ఉంటావని సూచించాడట.

దీపిక పదుకొనె

దీపిక పదుకొనె


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె 2003లో ‘జస్ట్ సెవెన్ టీన్ మేగజైన్ కోసం ఫస్ట్ రన్ వే అప్పియరెన్స్ ఇచ్చిందట.

ఇమ్రాన్ ఖాన్

ఇమ్రాన్ ఖాన్

అమీర్ ఖాన్ మేనలుడు, బాలీవుడ్ యంగ్ హీరో ఇమ్రాన్ ఖాన్ వాస్తవానికి ఇండియన్ సిటీజెన్ కాదు, అతను అమెరికా పౌరుడు.

మాధురి దీక్షిత్

మాధురి దీక్షిత్

మాధురి దీక్షిత్ నటించిన ‘హమ్ ఆప్‌కె కౌన్' చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రం ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఈ చిత్రం యూకెలో 1 మిలియన్ పౌండ్లు కలెక్ట్ చేసింది.

అమీర్ ఖాన్

అమీర్ ఖాన్


అమీర్ ఖాన్ సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడానికి కారణం ఆయన నటించిన లగాన్ చిత్రం ఆస్కార్ నామినేషన్లలో రిజెక్ట్ కావడమేనట.

సుస్మితా సేన్

సుస్మితా సేన్

మాజీ బ్యూటీ క్వీన్, బాలీవుడ్ నటి సస్మితా సేన్ కొండచ చిలువను పెంపుడు జంతువులా పెంచుకుంటుందట.

అర్జున్ రాంపాల్

అర్జున్ రాంపాల్

అర్జున్ రాంపాల్ Schweppes అనే పానీయం వ్యాపార ప్రకటనలో నికోలస్ కిడ్మన్‌తో కలిసి నటించాడు. ఈ యాడ్ ఫిల్మ్‌కు గ్లాడియేటర్ డైరెక్టర్ సర్ రిడ్లీ స్కాట్ నిర్మాత కాగా, శేఖర్ కపూర్ దర్శకుడు.

పరిణీత చోప్రా

పరిణీత చోప్రా


పరిణీత చెప్రా తన 12వ తరగతి ఎగ్జామ్ లో ఆలిండియా ఫస్ట్ వచ్చింది. భారత రాష్టపతి నుంచి రివార్డు కూడా దక్కించుకుంది.

షాహిద్ కపూర్

షాహిద్ కపూర్


మ్యూజిక్ వీడియోలు, వ్యాపార ప్రకటనలతో కెరీర్ ప్రారంభించిన బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, సుభాష్ గై దర్శకత్వంలో వచ్చిన ‘తాల్' చిత్రంలో బ్యాగ్రౌండ్ డాన్సర్‌గా చేసాడు. ఇష్క్ విష్క్ చిత్రం ద్వారా హీరోగా తెరంగ్రేటం చేసాడు. తొలి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకున్నాడు.

ప్రీతి జింతా

ప్రీతి జింతా


బాలీవుడ్ నటి ప్రీతి జింతాకు కేవలం నటన మాత్రమే వచ్చనుకుంటే పొరపాటే. బిబిసి న్యూస్ ఆన్ లైన్ సౌత్ ఏసియాకు ఆమె వరుస కాలమ్స్ కూడా రాసేదట.

English summary
Secret facts about Film stars. Secrets are sometimes funny and often quirky. We have for you a few interesting facts about a few leading actors and actresses.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu