నా సినిమాల సక్సెస్ కు రహస్యం అదే: రవితేజ
నా సినిమాకొచ్చే వారంతా సరదాగా నవ్వుకోవడానికే వస్తారు..వారిని ఎంటర్ టైన్ చేయ్యడమే నా లక్ష్యం..అలాంటి సబ్జెక్ట్స్ ఎంచుకోవడంలో రహస్యమదే.."అంటున్నాడు హీరో రవితేజ. రెండున్నర గంటటపాటు ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా సినిమా వుండాలనుకుంటాననీ, తన వద్దకు ఏ దర్శకడొచ్చినా, ఆ పాయింట్ మీదే ఎక్కువ దృష్టిపెట్టమని చెబుతుంటాననీ, ఒకసారి సినిమా ఒకే అయిపోయాక దర్శకుడి పనిలో వేలు పెట్టనని రవితేజ చెప్పుకొచ్చాడు ఓ ఇంటర్వ్యులో..
ఏడుపులూ పెడబొబ్బలు నాకు నచ్చవ్..నాకే కాదు, సినిమాల ప్రేక్షకుల్లో చాలా మందికి నచ్చవు..అందుకే ఎంటర్ టైన్ మెంట్ సినిమాలకు ఎక్కువగా పచ్చ జెండా ఊపుతాను.." అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు రవితేజ. 'మిరపకాయ్" సినిమాలో రిచా-దీక్షా సేథ్.ఇద్దరితోనూ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఫర్ ఫెక్ట్ గా వర్కవుట్ అయ్యిందనీ, కమెడియన్లలో సునీల్ తో తన కాంబినేషన్ చాలా బావుంటుందని రవితేజ అంటున్నాడు. మిరపకాయ్" సినిమాలో రిచా-దీక్షా సేథ్..ఇద్దరితోనూ ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీ ఫర్ ఫెక్ట్ గా వర్కవుట్ అయ్యిందనీ, కమెడియన్లలో సునీల్ తో తన కాంబినేషన్ చాలా బావుంటుందని రవితేజ అంటున్నాడు.'మిరపకాయ్" సక్సెస్ ని మాగ్జిమయ్ ఎంజాయ్ చేస్తున్నాననీ, వసూళ్ల పరంగా తన కెరీర్ లో 'మిరపకాయ్" ది బెస్ట్ అని రవితేజ డిసైడ్ చేసేశాడు.


Click it and Unblock the Notifications











