నాగార్జున సైలెన్స్ కి కారణం?

By Staff

nagarjuna
నాగార్జున తన భూముల వ్యవహారంలో ప్రభుత్వం ద్వారా లబ్ది పొందుతున్నందుకే కాంగ్రేస్ అనుకూల ప్రకటనలలో నటిస్తున్నాడంటూ మీడియాలో వచ్చిన వార్తా కథనాలపై ప్రత్యక వివరణ ఇవ్వకుండా ఉండిపోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఈ విషయంలో మీడియా మీట్ ఏర్పాటు చేసి వివరణ ఇస్తే ఈ వివాదం మరింత జటిలం అవుతుందే తప్ప ప్రయోజనం ఉండకపోవచ్చునని ఆయన శ్రేయాభిలాషులు చెప్పిన సలహాను ఆయన అమలుచేస్తున్నారని వినిపిస్తున్నాయి.

అంతేగాక నాగార్జున కాంగ్రేస్ ప్రభుత్వం ప్రకటనల్లో నటించటం చూసిన మీడియా మిత్రులు కొందరు ఎంక్వైరీ చేయటం జరిగింది. అంతేగాక ఆ కథనాలు పత్రికల్లో ప్రముఖంగా రెండు రోజులుగా వస్తున్నాయి. సమాచారం బయిటకు పొక్కటంతో బాధపడిన నాగార్జున బెంగుళూరులో జరుగుతున్న కింగ్ షూటింగ్ షెడ్యూలు ఒక కొలిక్కి వచ్చిన నేపధ్యంలో శనివారం నాడు తిరిగి హైదరాబాదుకు వచ్చి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆరోపణల్ని ఖండించాలని నిర్ణయించుకున్నారు. మీడియా వాళ్ళను ముందే పిలవకుండే సరిగ్గా ప్రెస్ మీట్ సమయానికి పిలిచి వివరణ ఇవ్వాలని బావించారు.

అయితే కొందరు సన్నిహితులు అలాంటి వివరణ ఏదీ వద్దని ఆయనకు హితవు చెప్పారు. మీడియాను పిలిస్తే వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతో మరింతగా ఈ వివాదంలో కూరుకుపోతామని,ఇలా వదిలేస్తే మరో రెండు రోజుల్లో సమస్య చల్లారిపోతుందని వారు హెచ్చరించినట్లు సమాచారం. ఇక ఈ వాదన కూడా సబబుగా అనిపించటంతో ఆయన ప్రెస్ మీట్ ఆలోచనను విరమించుకున్నారు. బెంగుళూరు నుంచి నగరానికి రాలేదు కూడా. వివరణ ఇవ్వకుండా సమస్యను అలా వదిలేయాలని చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X