»   » అంతా షాక్: రూ. 15 కోట్ల బడ్జెట్ మూవీ రూ. 450 కోట్లు వసూలు చేసింది!

అంతా షాక్: రూ. 15 కోట్ల బడ్జెట్ మూవీ రూ. 450 కోట్లు వసూలు చేసింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu
అంతా షాక్..! సీక్రెట్ గా అన్ని కోట్లు వసూలా !

ఒక సినిమా కోసం ఖర్చు పెట్టిన బడ్జెట్ రూపాయి కూడా నష్టపోకుండా తిరిగి వసూలు అయితే చాలు సినిమా హిట్ అని ప్రకటించేస్తారు. రెండు మూడు రెట్లు లాభం వస్తే సూపర్ హిట్, పది రెట్లు లాభం వస్తే బంపర్ హిట్ అంటారు. అయితే ఒక సినిమాకు పెట్టిన పెట్టుబడిలో వందల రెట్లు వసూలైతే? ఊహించని రీతిలో లాభాల పంట పండితే? దాన్ని ఏస్థాయి హిట్ అని చెప్పడానికి పదాలు చాలవు. తాజాగా బాలీవుడ్ మూవీ 'సీక్రెట్ సూపర్ స్టార్' సినిమా విషయంలో ఇలాంటి అద్భుతమే జరిగింది.

 సీక్రెట్ సూపర్ స్టార్

సీక్రెట్ సూపర్ స్టార్

‘దంగల్' ఫేం జైరా వాసిమ్ ప్రధాన పాత్రలో అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీక్రెట్ సూపర్ స్టార్'. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ ఓ కీలకమైన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ఆయన నిర్మాత కూడా.

 అమీర్ ఖాన్ క్రేజ్

అమీర్ ఖాన్ క్రేజ్

అమీర్ ఖాన్ ఉండటంతో ఈ సినిమాపై ముందు నుండీ మంచి క్రేజ్ ఉంది. అయితే థియేటర్ల వరకు వెళ్లిన తర్వాత సినిమాలో జైరా వాసిమ్ పెర్ఫార్మెన్స్ చూసి అంతా ముగ్దులైపోయారు. దీంతో సినిమా హిట్ టాక్ రావడంతో పాటు ఇండియాలో మంచి వసూళ్లు వచ్చాయి.

చైనాలో దుమ్మురేపుతోంది

చైనాలో దుమ్మురేపుతోంది

చైనాలో అమీర్ ఖాన్ నటించిన చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన ‘పికె', ‘దంగల్' చిత్రాలు అక్కడ భారీ వసూళ్లు సాధించాయి. తాజాగా ‘సీక్రెట్ సూపర్ స్టార్' చిత్రానికి కూడా వసూళ్ల పంట పండుతోంది.

 చైనాలో రూ. 300 కోట్లకు చేరువైన వసూళ్లు

చైనాలో రూ. 300 కోట్లకు చేరువైన వసూళ్లు

ఈ నెల‌ 19న చైనాలో విడుదలైన ఈ సినిమా... వారం రోజుల్లోనే రూ. 293.18 కోట్లు వసూళ్లు రాబ‌ట్టింది.

చైనాలో వసూళ్ల వరద ఇలా

ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ చెప్పిన వివరాల ప్రకారం ఈ చిత్రం చైనాలో వారం రోజుల పాటు కలెక్షన్ల వివరాలు శుక్ర $ 6.92 మిలియన్, శని $ 10.59 మిలియన్, ఆది $ 9.94 మిలియన్, సోమ $ 5.04 మిలియన్, మంగళ $ 4.91 మిలియన్, బుధ $ 4.52 మిలియన్, గురు $ 4.23 మిలియన్.... టోటల్ $ 46.15 మిలియన్ (రూ. 293.18 కోట్లు) రాబట్టింది.

 ప్రపంచ వ్యాప్తంగా రూ. 450 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా రూ. 450 కోట్లు

ఇండియా, చైనా, ఇతర ప్రపంచ దేశాలన్నింటిలో కలిపి ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 450 కోట్ల వరకు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం.

 కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్

కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్

సీక్రెట్ సూపర్ స్టార్ చిత్రాన్ని కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇంత తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఒక సినిమా ఇంత భారీ వసూళ్లు సాధించడం భారతీయ సినీ చరిత్రలో ఇదే తొలిసారి.

English summary
Aamir Khan's Secret Superstar is doing brisk business at the China box office. After a superb weekend, the film has shown a strong hold during the weekdays as it made $4.23 million on its day 7, in similar range to $4.52 million on its day 6. The film has so far made $46.15 million (Rs 293.18 crore) in its week one.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu