అంగాంగ ప్రదర్శనే సినిమా సక్సెస్ కు కారణం...
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొందిన ఝుమ్మంది నాదం" చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచమైన అందాల ముద్దుగుమ్మ తాప్సీ. తన గ్లామర్ తో యువతను కట్టిపడేసిన ఈ బామ..ఝుమ్మంది నాదం చిత్రంలో అంగాంగ ప్రదర్శన చేసింది. ఈ సినిమాలో తాప్సీ చేసిన క్యారెక్టర్ కంటే..ఆమె చేసిన ఎక్స్ పోజింగ్ కే మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఈ పంజాబీ అమ్మాయికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి.
తన ఎక్స్ పోజింగ్ కు లభిస్తున్న క్రేజ్ పై ఈ ముద్దుగుమ్మ స్పందిస్తూ..'ఝమ్మందినాదం" చిత్రం ద్వారా యువతకు తాను తెగ నచ్చేశానని ప్రచారం చేసుకుంటోంది. అంగాంగ ప్రదర్శన, ఎక్స్‌పోజింగ్‌ను దర్శకేంద్రుడు చెప్పినదానికంటే మరింత బాగా బాగా చేయడంవల్లే యువత థియేటర్లకు వస్తున్నారని ఓ తుంటరి విలేకరి తాప్సీని ప్రశ్నించారు..
ఈ ప్రశ్నకు చిరునవ్వుతో సమాధానం ఇస్తూ..వాళ్ళ వయస్సు అమ్మాయిని కాబట్టే నా అందచందాలు వారికి బాగా నచ్చాయి. దానికి తోడు తన అందాలను దర్శకేంద్రుడు ప్రత్యేక కోణంలో చూపించారు. అయితే నేను ఎక్స్ పోజింగ్ చేయాలనుకోవడంలేదు. నా యాక్టింగ్ స్కిల్స్ ని చూపాలను కుంటున్నాను. పైపెచ్చు నటన కూడా బాగుంది అని చెప్పుకొచ్చింది. తాజాగా రవితేజ, విష్ణు, ప్రభాస్ సినిమాల్లో నటిస్తున్నట్టు తాప్సీ తెలిపింది. అలాగే గెస్ట్ రోల్స్ కి ఐటమ్ సాంగ్స్ కూడా నేను రెడి అంటోంది తాప్సి.


Click it and Unblock the Notifications











