బర్త్ డే గర్ల్ అందాల రిచా హాట్ ఫోటోలు
హైదరాబాద్: లీడర్ సినిమాతో 2010లో తెలుగు సినీరంగంలో ప్రవేశించింది రిచా గంగోపాధ్యాయ్. మూడేళ్లలోనే ఆమె తన గ్లామర్‌తో, నటనతో దక్షిణాదిన ప్రేక్షకుల హృదయాలను ఆకర్షించింది. దక్షిణాదిలో ఆమె ఇప్పుడు టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. త్వరలో తారామణిగా వెలుగొందే అవకాశాలున్నాయి.
రిచా గంగోపాధ్యాయ్ 1986 మార్చి 20వ తేదీన ఢిల్లీలో జన్మించింది. పెన్సిల్వేనియాలో, మిచిగాన్‌ల్లో పెరిగింది. 2005 నుంచి అందాల పోటీల్లో పాల్గొంటూ వచ్చింది. మిస్ ఇండియా యుఎస్ఎ పోటీల్లో ఆమె టాప్ టెన్‌గా నిలిచింది. మిస్ మిచిగాన్, మిస్ ఇండియా యుఎస్ఎగా ఎన్నికైంది. మిస్ ఫొటోజెనిక్ టైటిల్‌ను కూడా సంపాదించుకుంది.
రిచా అమెరికా నుంచి 2008లో ముంబైకి చేరుకుంది. సినిమాల్లో చేరాలనే ఉద్దేశంతో ఆమె ఇక్కడికి వచ్చింది. అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో చేరి నటనలో డిప్లమా తీసుకుంది. ఆ తర్వాత మోడలింగ్ చేయడం మొదలు పెట్టింది. వాటిక ఆల్మోండా హెయిర్ ఆయిల్, పీటర్ ఇంగ్లాండ్, మలబార్ గోల్డ్, కళానికేతన్ వంటివాటికి మోడలింగ్ చేసింది.
కమర్షియల్స్‌లో చేసిన తర్వాత రిచా గంగోపాధ్యాయ్ 2010లో తెలుగు సినిమా లీడర్‌లో అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. తెలుగు, తమిళం, బెంగాలీ భాషల్లో 9 సినిమాల్లో నటించింది. భాయ్ తెలుగు సినిమా షూటింగులో ఆమె ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ నెల 20వ తేదీతో ఆమె 27వ పడిలో పడుతోంది. ఆమెకు ముందుగానే హ్యాపీ బర్త్ డే చెబుదాం.

శేఖర్ కమ్ముల లీడర్ సినిమా కోసం రిచా గంగోపాధ్యాయ్ ఆడిషన్‌కు హాజరైంది. వెంటనే శేఖర్ కమ్ముల ఆమెను ఎంపిక చేసుకున్నాడు. ఆ తర్వాత రెండు రోజులకే సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

రిచా లీడర్ సినిమాలో రాజకీయ నాయకుడి కూతురిగా నటించింది. అందులో లీడర్‌తో ప్రేమలో పడుతుంది. లీడర్ పాత్రను రాణా దగ్గుబాటి చేశాడు.

లీడర్ సినిమా కమర్షియల‌్‌గా హిట్టయింది. రిచా అందానికే కాకుండా నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఈ సక్సెస్‌తో నాగవల్లి సినిమాలో ఆమెకు దర్శకుడు పి. వాసు అవకాశం ఇచ్చాడు.

నాగవల్లి ఆత్మ ఆవహించే పాత్రలో రిచా గంగోపాధ్యాయ్ ఆ సినిమాలో బాగా నటించిందనే ప్రశంసలు అందుకుంది.

లీడర్‌లో రిచా నటన దర్శకుడు హరీష్ శంకర్‌ను ఆకట్టుకుంది. రవి తేజా సరసన నటించేందుకు మిరపకాయ్ సినిమాలో రిచాను తీసుకున్నాడు.

ఆ తర్వాత రిచ మాయక్కమ్ ఎన్నా, ఓస్ట్నే అనే రెండు తమిళ సినిమాల్లో నటించింది.

ఆ తర్వాత 2012లో బిక్రమ్ సింఘ అనే సినిమా ద్వారా బెంగాలీ ఆరంగేట్రం చేసింది.

ప్రస్తుతం రిచా గంగోపాధ్యాయ్ భాయ్ సినిమాలో నటిస్తోంది. షూటింగ్‌పై ఆమె దృష్టి పెట్టింది.


Click it and Unblock the Notifications











