పవన్ కళ్యాణ్ రేర్ మూమెంట్స్ (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్న స్టార్ హీరో. చిరంజీవి సోదరుడు కావడంతో పెద్దగా కష్టపడకుండానే సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ....అన్నయ్యకు తగిన తమ్ముడు అని పేరు తెచ్చుకోవడానికి, టాప్ పొజిషన్‌కు చేరుకోవడానికి మాత్రం తనదైన టాలెంట్‌, స్టైల్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసాడు పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల్లో భారీ హిట్లు వేళ్లపై చెప్పుకోదగ్గవే అయినా అంతుకు మించిన పాపులారిటీ సంపాదించుకున్నారు. పవన్ అంటే ప్రేక్షకుల్లో ఏదో తెలియని ఆసక్తి, ఆయన సినిమా వస్తుందంటే ఎక్కడలేని ఉత్సాహం. ఫ్యామిలీ, యూత్, క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన హీరో వపన్ కళ్యాణ్.

బహుషా ఆయన ఇలాంటి అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి ఆయన వ్యవహార శైలి, ముక్కుసూటిగా వెళ్లే తీరు, సున్నిత మనస్తత్వం కూడా అయి ఉండవచ్చు.... పవన్ కళ్యాణ్ రేర్ మూమెంట్స్‌తో పాటు ఆయన గురించిన మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యణ్‌గా పాపులర్ అయిన కొణిదెల కల్యాణ్ బాబు తెలుగు చిత్ర సీమలో మెగాస్టార్ గా వెలుగుతున్న చిరంజీవి సోదరుడు. కొణిదెల వెంకటరావు, అంజనా దేవిల మూడవ కుమారుడు. పవన్, సెప్టెంబరు 2, 1973న జన్మించాడు.

మెగా ఫ్యామిలీ

మెగా ఫ్యామిలీ

పవన్ కళ్యాణ్‌కు ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. తెలుగు సినిమా పరిశ్రమలోని మెగాస్టార్ చిరంజీవి పవన్‌కు పెద్దన్నయ్య . నటుడు మరియు నిర్మాత అయిన నాగేంద్ర బాబు పవన్‌కు రెండవ అన్నయ్య.

విద్యాభాస్యం

విద్యాభాస్యం

పవన్, పరిశ్రమలోని తన అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తి ని పెంచుకున్నాడు. ఇంటర్ మీడియట్ నెల్లూరు లోని వి.ఆర్.సి కళాశాలలో పూర్తి చేసాడు. పిమ్మట కంప్యూటర్స్ లో డిప్లోమా చేశాడు.

సినిమాల్లోకి...

సినిమాల్లోకి...

1996 సంవత్సరంలో విడుదలైన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రం ద్వారా కళ్యాణ బాబుగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. అంతకు ముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రావీణ్యం సంపాదించారు.

పవన్ ఫ్యామిలీ

పవన్ ఫ్యామిలీ

నటిగా మారిన మోడల్ రేణుదేశాయ్‌ని 28 జనవరి 2009 న వివాహం చేసుకున్నాడు. వీరికి కలిగిన కుమారుని పేరు అకీరా నందన్. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకీరా కురుసోవా పై అభిమానంతో వారు తమ కొడుకుకు ఆ పేరు పెట్టుకున్నారు. పవన్ కూతురు పేరు ఆద్య.

భిన్నమైన వ్యక్తి

భిన్నమైన వ్యక్తి

తెలుగు చిత్ర రంగంలోని సమకాలీన కథానాయకులకు, పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విభిన్న ఆలోచనా ధోరణే పవన్ కళ్యాణ్ కి చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది.

దర్శకుడిగా

దర్శకుడిగా

‘జానీ' చిత్రంతో అతి పిన్న వయసులోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన కథానాయకులలో పవన్ కళ్యాణ్ ఒకరు. తన చిత్రాలకి, చిరంజీవి నటించిన చాలా చిత్రాలకు పవన్ కళ్యాణ్ ఫైట్ లని రూపొందించారు.

పవన్ కెరీర్లో..

పవన్ కెరీర్లో..

పవన్ కళ్యాన్ కెరీర్లో తొలి ప్రేమ, బద్రి, ఖుషి, గబ్బర్ సింగ్ లాంటి చిత్రాలు భారీ విజయాన్ని సాధించాయి. పవన్ కళ్యాణ్ రేంజి తారాస్థాయికి చేరడంలో ఈ సినిమాలదే ప్రత్యేక పాత్ర అని చెప్పొచ్చు.

అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది

ప్రస్తుతం పవన్ కళ్యాన్ నటించిన ‘అత్తారింటికి దారేది' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా అనుకోని కారణాలతో వాయిదా పడింది. ఈ నెలాఖరున లేదా వచ్చే నెలలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

నెక్ట్స్ సంపత్ నంది దర్శకత్వంలో

నెక్ట్స్ సంపత్ నంది దర్శకత్వంలో

అత్తారింటికి దారేది చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ సంపత్ నంది దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈచిత్రానికి గబ్బర్ సింగ్-2 అనే టైటిల్ ప్రచారంలో ఉంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X